Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చండూర్
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితన కాంట్రాక్టల కోసం, సొంత అవసరాలు కోసం పార్టీ మారుతున్నాడు తప్ప ప్రజల కోసం కాదు అని డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, పటేల్ రమేష్ రెడ్డి . బుధవారం ఆర్ అండ్ బీ అతిథి గహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తల , మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఓట్లతో గెలిచి తాను నియోజకవర్గానికి అభివద్ధి చేయకుండా, కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మునిగిపోయే పడవ అని, పదేపదే కాంగ్రెస్ పార్టీని దూషించడం సిగ్గుచేటు అని వారు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీలోనే కాంట్రాక్ట్లు వచ్చాయన్నారు. ప్రజలు నమ్మి ఎమ్మెల్యే చేస్తే ఏనాడైనా నియోజకవర్గానికి వచ్చావా ప్రభుత్వం తోటి కొట్లాడావా, అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాత్రాన పార్టీకి పెద్దగా ఒరిగేది ఏమీ లేదన్నారు. మళ్లీ మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 5వ న 50 వేల మందితో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చండూర్ మున్సిపాలిటీలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు.అధికార ప్రతినిధి పున్న కైలాస నేత మాట్లాడుతూ వచ్చే ఉప ఎన్నికల్లో మునుగోడు ప్రజలుబీజేపీని కూడా ఓడిస్తే ఎక్కడికి వెళ్తావు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ భిక్ష పెట్టిందన్నారు. దళారీ మారావు అని, చెప్పే మాటలు ప్రజలు నమ్మరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి రెడ్డి, పల్లె రవికుమార్, ఎంపీపీ పల్లె కళ్యాణి, బురుకల బిక్షం, మంచుకొండ సంజయ్, తదితరులు పాల్గొన్నారు.