Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భూదాన్ పోచంపల్లి
మండలంలోని దేశ్ ముఖి గ్రామంలో బుధవారం సాయి బందావనంలో సాయిబాబాను బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించే విధంగా సాయి బందావనాన్ని తీర్చిదిద్దడం పట్ల ట్రస్టచైర్మెన్ గంట నారాయణ స్వామీజీ అభినందించారు హైదరాబాదుకు కూత వేటు దూరంలో ఉన్న దేశముకు గ్రామ శివారులో ఎత్తైన గుట్టల పచ్చని ప్రశాంతమైన వాతావరణంలో సాయిబాబాను ప్రతిష్టించి ఆలయంలో భక్తులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడం అభినందనీయమన్నారు .మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, ట్రస్ట్ చైర్మెన్ గంట నారాయణ స్వామీజీ అర్చకులు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలోజడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డిజెడ్పిటిసి కోట పుష్పలత వైస్ ఎంపీపీ పాక వెంకటేశం, మండల నాయకులు, పిలాయిపల్లి సర్పంచ్ హరీష్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాటి సుధాకర్ రెడ్డి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సామ రవీందర్ రెడ్డి సర్పంచ్ ఎంపీటీసీ స్థానిక నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి చుక్కెదురు
మండలంలోని దేశముఖ్ గ్రామంలో బుధవారం అష్టభుజ దేవాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గ్రామస్తులు అడ్డుకున్నారు. 2014 సంవత్సరంలో గెలిచిన నాటి నుండి నేటి వరకు గ్రామంలో ఎలాంటి అభివద్ధి జరగలేదని గతంలో గ్రామాలలో బీటీ రోడ్లు వేయించలేదని ఆరోపించారు. గ్రామం అభివద్ధి చెందాలంటే మునుగోడు ఎమ్మెల్యే లాగా రాజీనామా చేయాలని ప్రజలు నినాదాలు చేశారు. గ్రామ శివారులో లారీ దిగబడడంతో మంత్రి వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.