Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణ పరిధి కొమరబండ గ్రామంలోని తేజ విద్యాలయంలో విద్యార్థులకు కోదాడ రూరల్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ జాతీయ సైబర్ నేరజాగతి దివస్ సందర్భంగా సైబర్ నేరాల మీద అవగాహన, రహదారి భద్రత నియమాలు, ఆడపిల్లలపట్ల చెడు ప్రవర్తనపై అవగాహన కల్పించారు.తెలియని వ్యక్తులను ఫ్రెండ్స్ చేసుకోవద్దని, ఫేక్అకౌంట్ , పెద్ద బహుమతి వచ్చిందని చెప్పి డబ్బు ఆశ చూపితే తల్లిదండ్రులకు చెప్పాలని లేదా పోలీస్ శాఖ వారి 1930 లేదా 100కు వెంటనే డయల్ చేయాలని వివరించారు.రూరల్ సీఐ నాగదుర్గప్రసాద్ మాట్లాడుతూ 18 ఏండ్లలోపు వారు వాహనాలు నడపరాదని తెలిపారు.ఒకవేళ నడిపి యాక్సిడెంట్ చేసిన ఏవరినైనా చంపితే వారి తల్లితండ్రులకు 10 ఏండ్ల జైలుశిక్ష పడుతుందన్నారు.ఎవరైనా గంజాయి వంటి నార్కొటిక్ డ్రగ్స్వాడినా, కలిగి ఉన్నా, రవాణా చేసినా కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద 7 ఏండ్ల పాటు జైలు శిక్ష పడు తుందని,అలాంటివి గమనిస్తే కూడా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని రంగారెడ్డి ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ వి.సోమిరెడ్జి వివరించారు.ఈ కార్యక్రమంలో తేజ విద్యాలయం వైస్ ప్రిన్సిపాల్ మంత్రిప్రగడ వేణుగోపాల్, విద్యార్థులు పాల్గొన్నారు.