Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇసుక బస్తాలతో గండిని పూడ్చిన రైతులు
నవతెలంగాణ -రామన్నపేట
మూసీ నదికి వరద పోటెత్తాడంతో మండలంలోని లక్ష్మాపురం గ్రామం వద్ద మూసీ నదిపై ఉన్న లక్ష్మాపురం ఏటి కాల్వకు వరద నీరు పోటెతడంతో లక్ష్మాపురం ఏటి కాలువకు గండి పడి నీరు తిరిగి మూసి లోకి వరద పోతుండడంతో గ్రామస్తులు నీటిపారుదల శాఖ అధికారులకు అనేకమార్లు విన్నవించిన స్పందించకపోవడంతో బుధవారం లక్ష్మాపురం రైతులు, గ్రామస్తులు ఇసుక బస్తాలను వేసి గండిని పూడ్చే ప్రయత్నం చేశారు. లెక్కలేనన్నిసార్లు లక్ష్మాపురం ఇటుకలువ కరకట్ట బలహీనంగా ఉందని, వరదొస్తే కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని విన్నవిచ్చామని గ్రామ రైతులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గండిని పూడ్చి, బలహీనంగా ఉన్న కట్టకు మరమ్మతులు చేయాలని రైతులు కోరారు.