Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ -నల్లగొండ కలెక్టరేట్
గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సేవలు అందించేందుకు బ్యాంకు కరెస్పాండెంట్ ల పాత్ర ముఖ్యమైనదని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం జిల్లా గ్రామీణాభివద్ధి శాఖ కార్యాలయంలో నిర్వహించిన బ్యాంక్ కరస్పాండెంట్ ఏజెంట్ల అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు గ్రామంలో గడపగడపకు పారదర్శకంగా అందించేందుకు బ్యాంకుల సహకారంతో బ్యాంకు కరస్పాండెంట్ ఏజెంట్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామస్థాయిలో 26 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలు 24 గంటలు అందించేలా కషి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం బ్యాంకు కరస్పాండెంట్ సేవలు 32 మండలాలలో అమలులో ఉన్నట్లు తెలిపారు. ఈ బ్యాంకు సఖి ద్వారా ఆధార్ నమోదు, నవీకరణ, ఆధార అనుసంధానం, చెల్లింపు వ్యవస్థ ను అమలు చేయడం జాతీయ వత్తి సేవాధార క్రింద నమోదు చేయడం, ఈ- కోర్టుల ద్వారా ఫైల్ స్థితిని తనిఖీ చేసే సౌకర్యం, వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరు కి దరఖాస్తు, ఎల్పిజి సిలిండర్ రీఫీలింగ్, ఫాస్ట్ ట్యాగ్క్, రైల్వే టికెట్ బుకింగ్, వంటి సేవలు గ్రామస్థాయిలోనే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గ్రామ ప్రజలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కలిగించేందుకు బ్యాంక్ పద్ధతిని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బ్యాంకు సఖి ద్వారా సేవలు పొందిన అనంతరం తప్పనిసరిగా రసీదు పొందాలని వినియోగదారులకు సూచించారు. అనంతరం బ్యాంకు కరస్పాండెంట్ ఏజెంట్లకు బయోమెట్రిక్ ఆ తండకేషన్ పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ పిడి కాళిందిని, లీడ్ బ్యాంక్ మేనేజర్, సంబంధిత అధికారులు, డిఆర్డిఓ సిబ్బంది పాల్గొన్నారు.
జంతు సంక్షేమ చట్టాల అమలకు చర్యలు తీసుకోవాలి
మూగ జీవాలైన జంతువుల పై క్రూరత్వం నిరోధించే జంతు సంక్షేమ చట్టాలు అమలుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్ లో సమాజంలో జంతుల పట్ల క్రూరత్వాన్ని నిరోధించేందుకు పశు సంవర్థక శాఖ ఏర్పాటు చేసిన ఎస్పి సిఏ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జంతువుల పట్ల దయ, కరుణతో ఉండేందుకు విద్యార్థులలో అవగాహన కలిగించుటకు పాఠశాలల్లో ప్రత్యేక క్లాస్లు నిర్వహించాలన్నారు. ప్రతి మున్సిపాలిటీ లో కుక్కలు,పందులు,కోతుల ఉత్పత్తి నియంత్రణకు ఏనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ లు ఏర్పాటు చేయాలన్నారు. జంతువులు పశువులు వదించుటకు నిర్దేశిత ప్రభుత్వం స్థానిక సంస్థల ద్వారా సూచించిన స్తలం లో నే నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం లో అనాథ జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు కు 5 ఎకరాల స్థలం కేటాయించాలని సభ్యులు కలెక్టర్ ను కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో పశు సంవర్ధక శాఖాధికారి డాక్టర్ శ్రీనివాస్, డిపిఓ విష్ణు వర్ధన్,డిఈఓ భిక్ష పతి,డిపిఆర్ఓ శ్రీనివాస్,రవాణా శాఖ అధికారి సురేష్ రెడ్డి ,పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు, జంతు సంరక్షణ కమిటీ సభ్యులు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.