Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫ్లెక్సీ దహనం
నవతెలంగాణ -మునుగోడు
మునుగోడు నియోజకవర్గం ఏర్పడి 65 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రాతినిధ్యంలోనే మునుగోడు నియోజకవర్గం అభివద్ధి చెందిందని ,మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ , కాంగ్రెస రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్వాయి స్రవంతి రెడ్డి , టీపీసీసీి అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీకి , ఎమ్మెల్యే పదవికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజగోపాల్ రెడ్డి ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి అడిగిన పదవులకు బి ఫామ్ ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుకుంటే నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు పార్టీకి నష్టం కలిగించే విధంగా అర్ధాంతరంగా పార్టీకి పదవికి , స్వలాభం కోసం రాజీనామా చేసి బీజేపీలో చేరడం సిగ్గుచేటు అన్నారు. అఅనంతరం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపడుతున్న వీఆర్ఏల కు సంఘీభావం తెలిపారు . ఈ కార్యక్రమంలో మిర్యాల మధుకర్ పాల్వాయి చెన్నారెడ్డి కాటం వెంకన్న జీడిమెట్ల సునీల్ సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.