Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
అసలైన దోషులను పట్టుకునేంత వరకు బీఎస్పీ ఉద్యమిస్తుందని ఆ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు గుండెపంగు రమేష్ అన్నారు.బుధవారం పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఐదు రోజుల కింద తిప్పర్తి, నకిరేకల్ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నాటి నుంచి నేటి వరకు ఎటువంటి ప్రెస్‌మీట్ పెట్టకుండా, దొరికిన గంజాయిని చూపించకుండా కాలయాపన చేస్తూ నిజమైన దోషులను తప్పించి ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలను దోషులుగా చిత్రీకరిస్తూ వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు.1500 కిలోల గంజాయి పట్టుబడితే 400 కిలోలు మాత్రమే చూపించారని, మిగతా 1100 కిలోల గంజాయిని ఏమి చేశారని, ప్రచారంలో ఉన్న అధికార టీఆర్ఎస్ పెద్ద నాయకులను తప్పించి సామాన్యులైన నిరుపేదలను రెక్కాడితే గాని డొక్కాడని వారిని బలవంతంగా ఇరికించారన్నారు.అక్రమంగా తరలిస్తున్న గంజాయి గ్యాస్ సిలిండర్ల అడుగు భాగానికి కట్ చేసి దాంట్లో గంజాయి ప్యాకెట్లు అమర్చి మళ్లీ సిలిండర్‌ను వెల్డింగ్ చేసి కనిపించకుండా రంగులు వేసి తరలించిన కేసులో ఆ గ్యాస్ సిలిండర్ ఎవరివి,ఏ కంపెనీ కి సంబంధించినవి,ఎక్కడ కూడా గ్యాస్ సిలిండర్ల ప్రస్తావన రాకపోవడం,సిగ్గుచేటని కేసుని పక్కదారి పట్టించడానికి నిందితులను కాపాడుతున్నారన్నారు.గంజాయి కేసు లో పట్టుకున్న వాహనాలు ఒక వాహనానికి నెంబర్ ప్లేట్ లేదని, మరి ఒక వాహనం ఎక్స్‌యూవీ 500 నెంబర్ ప్లేట్‌ను కూడా తప్పుగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారన్నారు. ఆ కార్లు ఎవరివి, దీని వెనక పెద్దపెద్ద నాయకుల హస్తాలు ఉన్నాయని వారిని తప్పించే ప్రయత్నంలో అధికారులు, నాయకులు ఉన్నారన్నారు.టీ షాప్‌లో, పాన్‌షాప్‌లో పాన్ ఎంత సునాయాసంగా దోరుకుతుందో అలాగే గంజాయి కూడా కోదాడలో అంత సునాయాసంగా దొరుకుతుందని దుయ్యబట్టారు.విశాఖ మన్యం ప్రాంతంలో పండించే గంజాయి పంట అక్కడ కంటే ఇక్కడే ఎక్కువగా అందుబాటులో ఉంటుందన్నారు.నిన్న మఠంపల్లి లో 75 కిలోల గంజాయి దొరికిన వెంటనే నిందితున్ని అరెస్ట్ చేసి, ఉత్తరప్రదేశ్వాసిగా గుర్తించి, బండిని సీజ్ చేసి ప్రెస్‌మీట్ పెట్టిన అధికారులు నకిరేకల్,తిప్పర్తిలో దొరికిన గంజాయి విషయంలో ఎందుకు ఇన్ని రోజులు సమయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే సీబీఐ కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీలో చేరండన్నారు.అక్రమ గంజాయి రవాణా కేసులో నుంచి బయటపడాలంటే టీఆర్ఎస్లో చేరాలని ఎద్దేవా చేశారు..అసలైన నేరస్తులను పట్టుకునేంత వరకు ఉద్యమిస్తామని, అవసరమైతే ప్రజా సంఘాలను, అఖిలపక్ష నాయకులను కలుపుకొని పెద్దఎత్తున పోరాడుతామని తెలిపారు.ఈ సమావేశంలో నియోజకవర్గ కోశాధికారి కందుకూరి ఉపేందర్, ప్రధానకార్యదర్శి మామిడి రవికుమార్‌గౌడ్, యూత్ అధ్యక్షుడు సయ్యద్‌రఫీ, సీనియర్ నాయకులు బరిగెల పుల్లయ్య, కోదాడ ఇన్చార్జి కంపాటి శ్రవణ్‌కుమార్, మహిళానాయకురాలు నాగమణి, నిర్మల, సోషల్‌మీడియా ఇన్చార్జి కర్లప్రేమ్, నాగయ్య పాల్గొన్నారు.