Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ఆలేరు నియోజకవర్గ కేంద్రంగా నీరా పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ,ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డిని రాజపేట మండలంలోని రఘునాథపురం, వెంకటాపురం, సోమవారం, లక్ష్మక్కపెళ్లి, నమిలే ,బొందుగుల గ్రామాలకు చెందిన గౌడ సంఘం నాయకులు కలిసి కోరారు .సంఘం నాయకులతో ప్రభుత్వ విప్ సునీత ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ త్వరలో ఆలేరు కేంద్రంగా నీరా సబ్ సెంటర్ ఏర్పరిచే అవకాశం ఉన్నందున ఆలేరుకు దగ్గరగా ఉన్న గ్రామాలలో ఈత మొక్కలను ఎక్కువగా పెంచాలన్నారు.అందుకు కావలసిన దాదాపు 3000 మొక్కలను ప్రభుత్వం తరఫున వెంటనే ఏర్పాటు చేయిస్తానని, మొక్కలు నాటడానికి కావలసిన అనువైన స్థలాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు . ప్రతి గ్రామంలోనూ గీత కార్మికులు సొసైటీ లో సభ్యత్వ నమోదు తీసుకునేలా ప్రోత్సహించాలని కోరారు.