Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చౌటుప్పల్ రూరల్
దివిస్ పరిశ్రమ యాజమాన్యం గ్రామంలో జరుగుతున్న అభివద్ధిలో భాగస్వాములు కావడం అభినందనీయమని పంతంగి గ్రామ సర్పంచ్ బాతరాజు సత్యం అన్నారు. మండలంలొ పంతంగి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు రూ.8,82,081 విలువైన బ్యాగులు, నోట్ బుక్స్, వాటర్ బాటిల్స్, షఉస్ సాక్స్, బూస్ట్ ప్యాకెట్లను అందజేశారు. దివిస్ పరిశ్రమ యాజమాన్యం గ్రామంలో సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఆర్థికంగా తోడ్పాటునందించారన్నారు. విద్యాభివద్ధికి కూడా కషి చేస్తూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సహకారం అందిస్తున్నారని తెలిపారు. సి ఎస్ ఆర్ నిధులను గ్రామానికి వెచ్చించి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చెందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్లు అంతటి అశోక్, రోడ్డ భగత్ సింగ్, ప్రధానోపాధ్యాయులు బాలరాజు, మురళీమోహన్, దివిస్ ప్రతినిధులు వల్లూరి వెంకటరాజు పాల్గొన్నారు.