Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిష్టానం మాటే కాంగ్రెస్ నాయకులకు వేదవాకు
- మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తన కాంట్రాక్టులు కోసం పార్టీ మారడం దారుణమని మాజీ మంత్రి,పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు.బుధవారం జిల్లాకేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా ఈడీ విచారణ పేరుతో కార్యాలయానికి పిలిపించి వేధిస్తుంటే, యావత్ దేశంలోని కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాలు, నిరసనలు తెలియజేస్తున్నారన్నారు.ఇటువంటి తరుణంలో రాజగోపాల్‌రెడ్డి మాత్రం పార్టీని పట్టించుకోకుండా బీజేపీ హోం శాఖ మంత్రి అమిత్‌షాతో కాంటాక్టు కోసం భేటి కావడం దుర్మార్గపు ఆలోచన అన్నారు. దీనిపై పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని చెప్పారు. అందుకు ఆయనపై ఏ క్షణాన్నైనా వేటు పడుతుందని భావించి ముందస్తుగానే పార్టీకి రాజీనామా చేశారని ఆరోపి ంచారు.కాంగ్రెస్ రాజ గోపాల్ రడ్డికి మంచి గుర్తింపు ఇచ్చి ందని, అయినప్పటికీ ఆయన ఎన్నో విమర్శలు చేసినా కూడా క్రమశిక్షణతో ఇతర నాయకులు కాంగ్రెస్‌లో ఉన్నం దున ఆయనపై అధి ష్టానం ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. ఆయన కుటుంబానికి ఎన్నో పదవులు ఇచ్చిన ఘనత తమ పార్టీకే దక్కిందన్నారు.కోమటిరెడ్డి ఎప్పుడైనా కాంగ్రెస్ బ్రాండ్ అని చెప్పుకోలేదని,కోమటిరెడ్డి బ్రాండ్ అనే చెప్పుకొని కాలమెళ్లబుచ్చారని వ్యాఖ్యా నించారు.టీపీసీసీ అధ్యక్షపదవికి వయస్సుతో, అనుభవ నిమిత్తం గానీ లేదన్నారు.అధిష్టానం సూచించిన వ్యక్తినే గౌరవించడం తమ పార్టీ సిద్ధాంతమన్నారు. మునుగోడులో ఆయన కోమటిరెడ్డి బ్రాండ్‌తో గెలవలేదని, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఓటేసీ 25 వేల మెజార్టీతో గెలిపించారని స్పష్టం చేశారు.మళ్లీ మును గోడులో ఎన్నికలొస్తే గెలిచేది కాంగ్రెస్ మాత్రమేనని జోస్యంచెప్పారు.