Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తనిఖీ చేసిన వైద్య,ఆరోగ్య కుటుంబ సంక్షేమ రాష్ట్ర సంచాలకులు శ్వేతమెహంతి
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ రాష్ట్రసంచాలకులు శ్వేతమెహంతీ బుధవారం ఆకస్మికగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. సహజ ప్రసవాలపై దష్టి పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. మొదటి కాన్పు చేసుకున్న వాళ్లలో మొత్తం 35 కాన్పుల్లో 24 సహజప్రసవాలు అవడం శుభ పరిణామమన్నారు.అనవసర సిజేరియన్ ఆపరేషన్ల వల్ల జరిగే నష్టాలపై ప్రజల్లో విస్తత స్థాయిలో ప్రజల్లో ప్రచారం చేయాలని ఆదేశించారు.ప్రతి గర్భిణీ తప్పకుండా సహజకాన్పు కోసం వ్యాయామం చేయాలన్నారు. అనంతరం ఆస్పత్రిని పరిశీలించారు. ప్రభుత్వాస్పత్రిలో ఉచితంగా నిర్వహించే ట్రూనాట్ క్షయ వ్యాధి పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హేమంత్ పాటిల్, డీఎంహెచ్ఓ హర్షవర్ధన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ నిరంజన్, జిల్లా ఆస్పత్రుల సమన్వయఅధికారి వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ డాక్టర్ రజని, రాష్ట్ర ప్రోగ్రాం అధికారులు పద్మజ, రాజేశం, శ్రావణ్, జిల్లా ప్రోగ్రాం అధికారులు జయ శ్యాంసుందర్, డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ చంద్రశేఖర్, వైద్యులు ఝాన్సీ, సురేష్, విజరు, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.