Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహనీయుల త్యాగాన్ని మర్చిపోవద్దు
- కలెక్టర్ పాటిల్ హేమంతకేశవ్
నవతెలంగాణ-సూర్యాపేట
ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్అని, రక్షాబంధన్ సోదరభావాన్ని పెంచుతుందని కలెక్టర్ పాటిల్ హేమంతకేశవ్ అన్నారు.స్వతంత్ర భారత వజ్రో త్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన జాతీయ సమైక్యత రక్షాబంధన్ కార్యక్ర మంలో చైర్పర్సన్ పి.అన్నపూర్ణ, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తోబుట్టువుల మధ్య అన్యోన్యతను ఇనుమడింప చేసేదే రక్షాబంధన్ అని అన్నారు.జిల్లాలో ప్రజలందరూ ఎంతో గొప్పగా రక్షాబంధన్ లో పాల్గొంటు న్నారని సోదరభావానికి ప్రతీక అని అన్నారు.ప్రభుత్వం మహిళ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్నారు.జిల్లాలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళ, ఆసరా ఫింఛన్ల వంటి అద్భుతమైన సంక్షేమపథకాలు అందిస్తున్నామన్నారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లలితా ఆనంద్, మహిళా కౌన్సిలర్లు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్‌చైర్మెన్ పుట్ట కిశోర్, డీిఎస్పీ నాగభూషణం, మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓ రాజేంద్రకుమార్,కౌన్సిలర్లు ఎండి షఫీఉల్లా, వెలుగువెంకన్న, జ్యోతి శ్రీవిద్య, మెప్మా పీడీ రమేశ్‌నాయక్, పారిశుధ్య విభాగ కార్మికులు, మెప్మా రిసోర్స్పర్సన్లు పాల్గొన్నారు.
చివ్వెంల :అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా, ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ, రక్త సంబంధాల ప్రేమ గుర్తుకొచ్చే విశిష్ట పండుగ రాఖీపౌర్ణమి.ఈ పండుగను శుక్రవారం మండలవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు.
కోదాడరూరల్ :సోదరి సోదరునికి భరోసానిచ్చే రక్షణ కవచం రాఖీ అని మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అన్నారు.పట్టణంలోని ఆమె నివాసంలో రాఖీపండుగ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డికి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ నాయకులకు రాఖీ కట్టారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పెండెం వెంకటేశ్వర్లు,షేక్ మదార్, తీపిరి శెట్టిరాజు,ధరావత్ స్వామినాయక్, చిలుకూరు మండల జెడ్పీటీసీ బొలిశెట్టి శిరీషనాగేంద్రబాబు, ఎంపీపీ బండ్ల ప్రశాంతికోటయ్య పాల్గొన్నారు.
మునగాల : స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను విద్యార్థులు అధ్యయనం చేయాలని ఎమ్మెల్యే బొల్లంమల్లయ్యయాదవ్ అన్నారు.శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన జాతీయజెండాలను పంపిణీ చేసి మాట్లాడారు.విద్యార్థులు జాతీయభావాన్ని పెంపొందించుకోవాలి సూచించారు. వజ్రోత్సవాల్లో విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు.రాఖీ పండుగ సందర్భంగా విద్యార్థులు, మహిళా అధికారులు, మహిళా నాయకురాలు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి స్వీట్లు పంచారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గుగులోత్ కృష్ణానాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ బుర్ర సుధారాణిపుల్లారెడ్డి, సొసైటీ చైర్మెన్లు కందిబండ సత్యనారాయణ, వల్లపురెడ్డి రాంరెడ్డి, తొగరు సీతారాములు, మండల అధ్యక్ష కార్యదర్శులు తొగరు రమేష్, ఎలకా వెంకటరెడ్డి,టీఆర్ఎస్ నాయకులు నల్లపాటి శ్రీనివాసరావు, వుప్పుల యుగంధర్‌రెడ్డి, సర్పంచ్ చింత కాయలఉపేందర్, వీరంరెడ్డి లింగారెడ్డి, మార్కెట్‌కమిటీ వైస్‌చైర్మెన్ ఉపేందర్‌గౌడ్, పాల్గొన్నారు.
సూర్యాపేటటౌన్ : జిల్లాకేంద్రంలోని టీపీసీసీ పటేల్ రమేశ్‌రెడ్డి నివాసంలో ఆయనకు అన్ని వర్గ,మతాలకు చెందిన మహిళలు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ, పలు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
మద్దిరాల: మండలవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ రాఖీ పండుగ నిర్వహించుకున్నారు.గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
మేళ్ళచెర్వు : మండలవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ రాఖీ పండుగ నిర్వహించుకున్నారు.గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
తిరుమలగిరి: మున్సిపాలిటీ కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహి ంచారు.మున్సిపల్ సిబ్బంది సీపీఐ(ఎం) నాయకులు కడెం లింగయ్యకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తిరుమలగిరి ఎక్స్‌రోడ్డు నందు రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు నిర్మల యాకయ్య, పడమటింటి నగేష్, మిర్యాలయాదయ్య, కొమ్ము సోమన్న, పానుగంటి శ్రీను పాల్గొన్నారు.
అర్వపల్లి : మండలకేంద్రంలోని నాగారం బాలికల కస్తూర్బాగాంధీ పాఠశాలలో విద్యార్థినులతో కలిసి జెడ్పీటీసీ రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బైరబోయినరామలింగయ్య, కనుకు శ్రీనివాస్,ఉపసర్పంచ్ పులిచర్ల ప్రభాకర్, వట్టె వెంకన్న, పులిచర్ల ప్రభు, సంద పృథ్వీ,ఎల్లాంలశ్రీకాంత్, పండుగలింగస్వామి, పాఠశాల ఎస్ ఓ శిరిన్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
చిలుకూరు: మండలంలోని 17 గ్రామాలలో రాఖీ పండుగను నిర్వహించుకున్నారు.