Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- ఆలేరురూరల్
భగవంతుడు అందించిన గొప్ప వరం అన్న చెల్లెలు అని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం మండలంలోని మందనపలి గ్రామంలో బ్యాక్ టు బ్యాక్ అనాధ ఆశ్రమం పిల్లలతో రాఖీలు కట్టించుకుని రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్న తమ్ముళ్ల బంధం తమకు ఎల్లవేళలా ఒకరికొకరు రక్షణగా ఉండాలని కోరుకొని రాఖి కట్టి దీవెనలు తీసుకునే గొప్ప పండుగ రాఖీ పౌర్ణమి అన్నారు. పిల్లల మధ్యన జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వీట్లు పంపిణీచేశారు. అనంతరం వారిని బ్యాక్ టు బ్యాక్ సంస్థ తరఫున సన్మానించారు .ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తివారి, సంస్థ చైర్మన్ దేవదాసు, సంస్థ మెంబర్ సైదులు సర్పంచ్ పండరి, ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్ రావు ,ఎంపీ ఓ సలీం ,ఉప సర్పంచ్ జంపాల సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి మహేందర్ ,సాత్విక్ నిర్వాహకులు జ్యోతి, విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఆలేరు టౌన్ : సోదర సోదరీమణుల మధ్య ఆత్మీయతను పంచేది రాఖీ పౌర్ణమి అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు మాజీ శాసన సభ్యురాలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ,బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ శాసనసభ్యులు బూడిద భిక్షమయ్యగౌడ్ వేర్వేరుగా అన్నారు రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని ప్రభుత్వ విప్ సునిత శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్కు హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ముఖ్యమంత్రి కెసిఆర్ సునీతను ఆశీర్వదించారు . మాజీ శాసనసభ్యులు బూడిద భిక్షమయ్య గౌడ్ కు హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రజలకు వారు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. Vౖాదరాబాద్ వరంగల్ పట్టణాల మధ్య తిరిగే బస్సులు మహిళల రాకతో కిక్కిరిసిపోయాయి .రహదారి వాహనాలమయంగా మారింది .పట్టణంలో రాఖీల పండుగ పురస్కరించుకొని పట్టణమంతా కోలాహలంగా మారింది. అన్నా చెల్లెళ్ల అక్కాతమ్ముళ్ల ఆత్మీయతలు వెల్లివిరిశాయి. అక్కాచెల్లెళ్లు అన్నాతమ్ముళ్ళకు రాఖీలు కట్టి మిఠాయిలు పంచారు.రాఖీల విక్రయ కేంద్రాల వద్ద మహిళలు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి రాఖీలు కొనుగోలు చేశారు .రాఖీలు 2 రూపాయల నుంచి 3డొందల రూపాయల వరకు అమ్మకాలు నిర్వహించారు. పట్టణ ప్రజలు నూతన వస్త్రాలు ధరించి శ్రీ కనకదుర్గ ఆలయం , శివాలయం ,శ్రీరంగనాయకా ఆలయం ,సంతోషి మాత ఆలయం లలో దేవతామూర్తులను దర్శించుకొని గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.సంతోషిమాత ఆలయంలో మహిళా భక్తులు లక్ష కుంకుమార్చన చేశారు.ఈ కార్యక్రమంలో కోకల సందీప్ , పత్తి సతీష్ , టి నాగరాజు ,పత్తి సాయి, మోక్షితు, శ్రీదేవి , స్వర్ణలత ,మాధురీ ,సౌమ్య ,శోభా, పద్మా , చింటూ , శ్రావణ్ బాబు, సాత్విక్ దేవ్, సాహితి రాజ్ ,కన్నయ్య ,చెర్రీ , శ్రీజ, ఉదరు, అంజి తదితరులు పాల్గొన్నారు .
మోత్కూరు:అన్నాచెల్లెళ్ల అనురాగానికి, ఆప్యాయతకు ప్రతీక అయిన రాఖీ పండుగను శుక్రవారం మోత్కూరు
మున్సిపాలిటీతో పాటు మండలంలో అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఘనంగా జరుపుకున్నారు. అన్నాతమ్ముళ్లకు అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. రాఖీ పండుగ సందర్భంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో నిర్వహించగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టగా, విద్యార్థినులు నాయకులకు, ప్రజాప్రతినిధులకు రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, వైస్ చైర్మన్ బి.వెంకటయ్య, మార్కెట్ చైర్మన్ కొణతంయాకూబ్ రెడ్డి, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పొన్నెబోయిన రమేష్, బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, గిరగాని శ్రీను, గజ్జి మల్లేష్, రైతుబంధు మండల అధ్యక్షుడు కొండా సోంమల్లు, మార్కెట్ మాజీ చైర్మన్ టి.మేఘారెడ్డి, నాయకులు కూరెళ్ల కుమారస్వామి, పి.ఆనందమ్మ, చెడిపెల్లి రఘుపతి, దాసరి తిరుమలేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మోత్కూరు: మహిళా సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మోత్కూరు జడ్పీటీసీ గోరుపల్లి శారద సంతోష్ రెడ్డి అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కిశోర్ కుమార్ నివాసంలో కలిసి ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు, యువతుల భద్రత కోసం, ఆర్థికాభివద్ధికిసీఎం కేసీఆర్ ఎంతో కషి చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిశోర్ కుమార్ మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటున్నారని, ఆదపలో ఉన్నవారికి చేయూతనిస్తూ మనోధైర్యం కల్పిస్తున్నారనితెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, ఆప్యాయతకు ప్రతీక అయిన రాఖీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.
మోట కొండూర్ : కేటీఆర్ పిలుపు మేరకు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆదేశానుసారం మోటకొండూర్ మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు మండల మహిళా అధ్యక్షురాలు బొలగాని నాగమణి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి చిత్రపటానికి రాఖీ కట్టినారు. అనంతరం మండల కేంద్రంలోని గురుకుల హాస్టల్ లో టీచర్లకు, విద్యార్థులకు రాఖీలు కట్టకొని రాఖీ పౌర్ణమి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఎగ్గిడి బాలయ్య, గ్రామశాఖ అధ్యక్షులు భూమండ్ల సుధీర్, మండల కో ఆప్షన్ సభ్యులు యండి బురాన్, డైరెక్టర్ బొబ్బలి యాదిరెడ్డి, టౌన్ సెక్రటరీ జనరల్ బొలగాని మోహన్ గౌడ్, బొబ్బలి బుచ్చిరెడ్డి, భూమండ్ల యాదయ్య, మహిళలు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి:75వ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా సమైక్యత రక్షాబంధన్ కార్యక్రమాన్ని 10 ,26 వార్డులలో హిందూ ముస్లిం సోదరీమణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్రానంతరం దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంతో ప్రపంచంలో ఏ దేశంలోలేని సంస్కతి సాంప్రదాయాలు భారతదేశంలోనే ఉన్నాయన్నారు. రాఖీ పండుగను హిందూ ముస్లిం సోదరీమణులు కలిసి ఘనంగా నిర్వహించుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఇట్టి కార్యక్రమంలో 26వ వార్డు కౌన్సిలర్ వీరపాక నరసింహ, వార్డు స్పెషల్ ఆఫీసర్ గాయపాక పవన్, ఆర్పీలు శమంతకమణి, సంతోషి, అమానత్ ,బింగి నరేష్ ,భూపాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మహిళలు పాల్గొన్నారు.
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని భువనగిరి పట్టణ మూలో 8 వ వార్డ్ లో కౌన్సిలర్ పంగరెక్కాల స్వామి, ఇట్టబోయిన సబిత గోపాల్ రాచమల్లు సుదర్శన్ ముస్లిం సోదరి మణులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మహిళలు మాట్లాడుతూ సంప్రదాయ పద్ధతిలో జరుపుకునే పండుగల లో రాఖీ పండుగ ఒకటి కుల మత లకు అతీతంగా అన్న చెల్లెళ్ళ అనుబంధం గుర్తు చేసే పండుగ అని కౌన్సిలర్ స్వామి అన్న అటు డాక్టర్ గా ఇటు ప్రజా సేవకు నిగా సేవలు అందిస్తూ వార్డ్ ప్రజలకు అందుబాటులో ఉంటురని తెలిపారు.
వీఆర్ఏ ల సమ్మె శిబిరంలో రాఖి పౌర్ణిమ వేడుకలు..
రామన్నపేట : మండల కేంద్రంలో తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విఆర్ఏలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె గురువారం నాటికి 19వ రోజుకు చేరుకుంది. గురువారం రాఖీ పౌర్ణిమ వేడుకల సందర్భంగా దీక్ష శిబిరంలోని మహిళా వీఆర్ఏలు తోటి విఆర్ఏలకు రాఖీలు కట్టారు. పండుగ సైతం లెక్కచేయకుండా సమ్మె కొనసాగిస్తూ దీక్ష శిబిరంలో రాఖీ పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా వీఆర్ఏలు ఎన్ పూజ, గౌసియా బేగం, నరసమ్మ, రాములమ్మ, అండాలు, యాదమ్మ, వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల వెంకన్న, ప్రధాన కార్యదర్శి మాదాసు నరసింహ, కమిటీ సభ్యులు నీరుడు లక్ష్మయ్య, మల్లయ్య, ఎండి జానీ, యూసుఫ్, రాములు, ముత్యాలు, భాస్కర్, వెంకటయ్య, యాదయ్య పాల్గొన్నారు.