Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గుంత కండ్ల జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ -సంస్టాన్ నారాయణపురం
దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. దళిత బంధు పథకం కింద మంజూరైన నిధులతో మండలంలోని గుడిమల్కాపురంలో లబ్ధిదారులు గాదే మంజుల శ్రీనివాస్ ఏర్పాటు చేసుకున్న బట్టలు,చెప్పుల షాపులు, టెంట్ హౌస్లను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులను ఆర్థికంగా పరిపుష్టి చేసేందుకు టీిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకం చేపట్టింది అన్నారు. ఈ పథకాన్ని దళితుల సద్వినియోగం చేసుకొని ఆర్థిక పరిపుష్టి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ ఉమా, జడ్పిటిసి వీరమల్ల భానుమతి, సర్పంచ్ మన్నే పుష్పలత చిత్రసేనారెడ్డి,ఎంపీడీవో యాదగిరి, నాయకులు మన్నె ఇంద్రసేనారెడ్డి, వీరమల్ల వెంకటేష్, సురవి యాదయ్య, గుప్తా ప్రేమ్చందర్ రెడ్డి తదితరులున్నారు.