Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్
పట్టణంలోని ప్లాట్‌పారం రిక్షా, ట్రాలీ ఆటో కార్మికుల ఎగుమతి, దిగుమతి ధరలను పెంచాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీతల రోషపతి కోరారు.శుక్రవారం స్థానిక వర్తకసంఘం భవనంలో కిరాణా షాపు యాజమాన్యం తో చర్చలు జరిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినందున కార్మికుల జీవన పరిస్థితులు ఇబ్బందిగా మారాయ న్నారు.గతంలో కార్మికులతో చేసుకున్న ఒప్పంద అగ్రిమెంటు రెండేండ్లు పూర్తైనందున ఉన్న ధరలపై 60శాతం పెంచాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసో సియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు ఉప్పల రమేశ్, మైలవరం నాగేశ్వరరావు, రేపాల వెంకటేశ్వర్లు, భూపతిగౌరయ్య, అంజి, శ్రీను, సీఐటీయూ జిల్లా కార్యవర్గసభ్యులు యల్క సోమయ్యగౌడ్, రిక్షాట్రాలీ ఆటో యూనియన్ అధ్యక్ష, కార్య దర్శులు పంగసైదులు, పిట్టల రమణయ్య, రాంరెడ్డి, ఉదయభాస్కర్, నర్సింహా రావు, చింతకాయల నాగరాజు, బుడిగ అప్పారావు, వాసు, గోపి పాల్గొన్నారు.