Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
ఈనెల 18న సూర్యాపేటలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ముగింపు ఉత్సవాలు ఉంటాయని, ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కల్లుగీత కార్మికసంఘం జిల్లా కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు కోరారు .శుక్రవారం ఆకుపాములలో సామాజిక చైతన్య యాత్ర నిర్వహించి మాట్లాడారు.సమాజ శ్రేయస్సుకోసం, కల్లుగీత కార్మికుల సంక్షేమకోసం పనిచేసి అమరులైన త్యాగమూర్తులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 2 నుండి 18 వరకు గ్రామ గ్రామాన సామాజిక చైతన్యయాత్రలు చేసి సభలు, సమావేశాలు నిర్వహించి. బహుజనుల కోసం పనిచేసిన సంఘ సంస్కర్తలను స్మరించు కుంటున్నట్టు తెలిపారు కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడిన అమరులు ధర్మబిక్షం, తొట్లమల్సూరు, బైరుమల్లయ్య, దేశిని చిన్నమల్లయ్య, బొలగాని పుల్లయ్య, పెరుమాండ్ల జగన్నాథం వంటి నాయకుల గురించి నేటి తరానికి తెలియజేస్తున్నామన్నారు. జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, నారాయణ గురు, అంబేద్కర్ లాంటి సామాజిక నాయకులు, సంఘసంస్కర్తల జీవిత విశేషాలను వారు చేసిన సేవలను ఈ తరానికి అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు కేసగాని వెంకన్న, స్థానిక సొసైటీ అధ్యక్షులు కేశగాని అంజయ్య,పోలంపల్లి వెంకటేశ్వర్లు,కేశగాని నాగేశ్వరరావు, పోలంపల్లి సతీష్, కేశగాని సీతయ్య, కాసాని ఉమేష్, కాసాని వీరయ్య, పోలంపల్లి సైదులు, పోలంపల్లి వీరబాబు , కాసాని గుర్వయ్య, పోలంపల్లి మూర్తి, కాకు నూరి ఖాశీం, పోలంపల్లి పెదరాయుడు, పోలంపల్లి శ్రీను పాల్గొన్నారు.