Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ
నవ తెలంగాణ -భువనగిరి రూరల్
ఈనెల 21వ తేదీన అనాజిపురం గ్రామంలో ప్రారంభమయ్యే మూసీ కాలుష్య ప్రక్షాళన సీపీఐ(ఎం) పోరు యాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ కోరారు. శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూసీలో ప్రవహించేది నీళ్లు కాదని కాలకూట విషమని అన్నారు. అనేక వ్యర్థాలతో వివిధ పరిశ్రమల ద్వారా ఫార్మా కంపెనీలు ఇష్టం వచ్చినట్లు తమ వ్యర్థాలను మూసీలో డంపు చేయడం వల్ల నీరు మొత్తం విషంగా మారిందన్నారు. ప్రపంచ స్థాయి అధ్యయనం ప్రకారం 104 దేశాల్లో 258 నదులపై సైంటిస్టులు పరిశోధన చేయగా ప్రమాదకరమైన నదుల్లో మూసీ 22వ స్థానంలో ఉన్నదన్నారు. మూసీ ప్రాంత భూగర్భంలో 40 మీటర్ల లోతు వరకు కాలుష్యం పెరిగిపోయి రైతులు పండిస్తున్న కూరగాయలు, వరిధాన్యాలు, చేపలు తినడంవల్ల ప్రజలు అనేక రకాలైన రోగాల పాలవుతూ క్యాన్సర్, కిడ్నీ జబ్బులకు, గుండె జబ్బులకు గురవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎన్నికల ముందు మూసీ ప్రక్షాళన గురించి మాటలు తప్ప చేతలు లేవని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూసీ జలాల శుద్ధికోసం,ప్రక్షాణలకోసం తగిన నిధులు కేటాయించి చర్యలు చేపట్టాలని, మూసీ కాల్వ వెంబడి గోదావరి, కష్ణ జలాలను ప్రత్యూమ్నయంగా అందించి ఆయా ప్రాంతాల చెరువులను నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భువనగిరి మండల పరిధిలోని వడపర్తి కత్వ లోతు, వెడల్పు పెంచి కాలేశ్వరం కాలువ ద్వారా నీటిని నింపి ఆ నీటిని భువనగిరి, బీబీనగర్ చెరువులకు పంపించి వాటి ఆధారంగా ఉన్న గొలుసుకట్టు చెరువులను నింపాలని కోరుతూ వీటి సాధన కోసమే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఈ నెల 21 నుండి 28 వరకు పోరు యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యాత్ర ప్రారంభ సభ ఈనెల 21న అనాజిపురం గ్రామంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నామని ఈ ప్రారంభ సభకు ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు , అనేకమంది మేధావులు, సైన్సిస్టులు, మూసీ కాలుష్య వ్యతిరేక సంఘాల నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ ప్రారంభ సభకు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా మూసీ కాలుష్యానికి భలవుతున్న ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం, మండల కమిటీ సభ్యులు గునుగుంట్ల శ్రీనివాస్, గ్రామ శాఖ కార్యదర్శి ఏదునూరు వెంకటేశం, సిపిఎం నాయకులు, రైతులు కాకర కష్ణ, గంగనబోయిన పాండు, గంగనబొయిన రాజు, బొల్లెపల్లి కిషన్, గంగనబొయిన బాల్ నర్సింహ, వరికుప్పుల రమేష్, ముద్రనబొయిన శ్రీశైలం, నారగోని అశోక్, ఎత్తరి ఎల్లయ్య, ఎదునూరి దశరథ, బొల్లెపల్లి మారయ్య, ధరావత్ పాండు నాయక్, కుఃచెం లక్ష్మయ్య, వెంకటస్వామి లు పాల్గొన్నారు.