Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చౌటుప్పల్ రూరల్
తూప్రాన్ పేట గ్రామ సమీపంలో జాతీయ రహదారి 65 శుక్రవారం మధ్యాహ్నం భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆందోల్ మైసమ్మ దేవాలయం నుండి హైదరాబాద్ వైపు వెళ్లే జాతీయ రహదారి ఇరువైపులా గుంతలు పడింది. నిత్యం ఇదే రహదారిపై ప్రయాణించే మంత్రులు సైతం గుంతలు పడిన రోడ్డుపై రోడ్డు వేయడం మర్చిపోయారు. మునుగోడు ఉప ఎన్నికలు వస్తాయనే కారణం చేత జాతీయ రహదారిపై ప్యాచ్ వర్క్ మొదలుపెట్టారు. దీంతో కొత్తగూడెం నుండి తూప్రాన్ పేట వరకు భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ లో ఇరుక్కున్న ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గుంతలపై ప్యాచ్ వర్క్ లు చేయకుండా హయత్ నగర్ నుండి దండు మల్కాపురం వరకు రోడ్డు వేయాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.