Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్ఐ) ఆవిర్భావ దినోత్సవాన్ని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్.రాములు ఎస్టీఎఫ్ఐ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.జాతీయస్థాయిలో ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యారంగ పరిరక్షణ కోసం అనేక ప్రాతి నిధ్యాలు పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.జాతీయ విద్యా విధానం2020 రద్దు కోరుతూ టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరము రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సోమయ్య,జిల్లా ఉపాధ్యక్షులు అరుణభారతి,జిల్లా కోశాధికారి జి.వెంకటయ్య, జిల్లా కార్యదర్శులు జె.యాకయ్య, బి.పాపిరెడ్డి, సోషల్మీడియాజిల్లా కన్వీనర్ డి.శ్రీనివాసచారి, మండలాలబాధ్యులు బి.ఆనంద్, వి.గోవర్ధన్, బి.రమేశ్, ఎన్.సైదా తదితరులు పాల్గొన్నారు.