Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప ఎన్నికలపై కమ్యూనిస్టులు సమీక్ష
- సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
నవతెలంగాణ-చండూర్
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ పతనం ప్రారంభమైందని, నియోజకవర్గ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని సీపీఐ(ఎం) రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. సీపీఐ(ఎం) మునుగోడు నియోజకవర్గ జిల్లా కౌన్సిల్ సభ్యులు సమావేశం ఆ పార్టీ కార్యాలయం మాధగోనినరసింహ భవన్ నల్పరాజు సతీష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోటగా నిలిచిందని, గతంలో 5 పర్యాయాలు సీపీఐ గెలుచుకుందన్నారు. రాజకీయ పరిణామాలు ఎన్నికల పొత్తులో భాగంగా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మద్దతు ఇచ్చి గెలిపించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభివద్ధి చేయకుండా తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో వెళ్తున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు దమ్ముంటే సీపీఐ మునుగోడు నియోజకవర్గం నుండి పోటీచేయాలని చేసిన సవాలును ఖండిచారు. దేశంలో మోడీ పరిపాలనలో అన్ని రకాల ధరలు పెంచి ప్రజలపై పెనుబారం మోపిన బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ప్రధాన శత్రువైన బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు బలమైన ఓటు బ్యాంకు ఉందని, గెలుపు ఓటముల ప్రభావం చూపుతుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ(ఎం) అభ్యర్థిని నిలబెట్టడంపై సమీ క్షిస్తున్నామన్నారు. త్వరలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న నక్కలగండి ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే పూర్తి చేయాలంటే డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో అధికారం పార్టీని పెండింగ్ ప్రాజెక్టుల నిర్లక్ష్యం పట్ల నిలదీస్తామని తెలిపారు. భూ నిర్వాసితులకు మల్లన్న సాగర్ ప్రాజెక్టు మాదిరిగా నష్టపరిహారం చెల్లించాలన్నారు. సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉజ్జిని యాదగిరిరావు, మందడి నరసింహారెడ్డి, బుల్గురి నరసింహ, గిరి రమ, వెంకటేశ్వర్లు, అంజాచారి, మండల కార్యదర్శులు చాపల శీను, పల్లె శేఖర్ రెడ్డి, ఈదులకంటి దుబ్బాక భాస్కర్, నలపరాజు రామలింగయ్య, తదితులున్నారు.