Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హామీల సంగతి ఏంటని కేసీఆర్ను నిలదీయండి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ లకుమార్
- మండలంలో కొనసాగిన ప్రజా సంగ్రామయాత్ర
నవతెలంగాణ-రామన్నపేట
రాష్ట్రంలో ఏ పనికైనా, ఏ సంక్షేమ పథకం అమలుకైనా కమిషన్ ముట్టందే కేసీిఆర్ ప్రభుత్వం పనులు చేయడం లేదని బీజేపీి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. సంజయ్ కుమార్ చేపడుతున్న మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర గురువారం మండల కేంద్రానికి చేరుకుంది. అనంతరం దుబ్బాక, మునిపంపుల గ్రామానికి చేరుకొని అక్కడ బస చేశారు. బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయనకు పూలమాలలు శాలువాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. స్తానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు 18 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏలతో గుడ్డు చాకిరి చేయించుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్కు వారి పాపం తగులుతుందని ఆయన సందర్భంగా అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుభాష్ సెంటర్లో ఏర్పాటుచేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికలలో కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు ఎప్పుడు చేస్తావని నిలదీయాలని ఆయన ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ చేతలు మాటలు వల్ల జోకర్ గా మారిండన్నారు. రాష్ట్ర నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులకు కమిషన్లు, కాంట్రాక్ట్ ఇస్తేనే పనులు చక చక జరుగుతాయని, వారి కుటుంబంలో ఐదుగురికి పదవులు వచ్చాయని ఎదేవా చేశారు. సర్కార్ కు ఎదురు తిరిగితే జైలుకు పంపుతారనే భయాన్ని ప్రజల్లో కలిగిస్తూ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటని 30 రూపాయలు కమిషన్ తీసుకున్న కేసీఆర్ సర్కార్ దానికి బదులు చెప్పాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు రైతు వేదికలు శ్మశాన వాటికల పేరిట కోట్లాది రూపాయలు మంజూరు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు. ప్రభుత్వానికి వారధిగా ఉన్న వీఆర్ఏలు పంచాయతీ సిబ్బంది పట్ల చూపడం తగదని వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. మండలానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు ని పీఏసీఎస్ డైరెక్టర్, బీజేపీ నాయకులు కన్నేకంటి వెంకటేశ్వర చారి గజమాలతో సత్కరించి దట్టిని కట్టారు. ఈ కార్య క్రమంలో ఆ పార్టీ.జిల్లా అధ్యక్షులు పి వి శ్యాంసుందర్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి నకిరెకంటి మొగులయ్య, ఏలే చంద్రశేఖర్, పార్టీ అధ్యక్షులు తాటిపాముల శివకృష్ణ గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ కన్నకంటి వెంకటేశ్వర చారి, నాయకులు దాసరి మల్లేశం, మడూరి ప్రభాకర్ రావు, ఏలూరి శ్యామ్, ఏలూరి రవి, డోగిపర్తి పద్మ, అక్కెనపల్లి సైదులు, గర్దాసు సురేష్ తదితరులు పాల్గొన్నారు.