Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13న కాంగ్రెస్ పాదయాత్ర
- 20న టీిఆర్‌ఎస్ బహిరంగసభ
- 21న బీజేపీ బహిరంగసభ
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి రాజీనామాతో రానున్న ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన రాజకీయ పార్టీల తమ జోష్‌ను పెంచాయి.. నియోజకవర్గంలో తమ పార్టీ బలోపేతం, కార్యకర్తలను ఉత్సహపరిచేందుకు అవసరమైన సమావేశాలు, సభలు, ప్రభుత్వ విదానాల పట్ల నిరసన కార్యక్రమాలు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలు... వాటిని పరిష్కరించాల్సిన పాలకుల వైఫల్యం, తదితర అంశాలను విసృత్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయా రాజకీయ పార్టీలు నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటనకు తగిన కార్యాచరణను రూపొందించాయి.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
గత మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు హైదారబాద్ గాందీభవన్ వేదికగా ఆశావాహులు, నియోజకవర్గ స్ట్రాటజీ కమిటీ, రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే దాదాపు మూడు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. అభ్యర్థి ఎవరైనా పార్టీకోసం పనిచేయాలని ఆశావాహులను ఒప్పించారు. అంతేగాకుండా అనుబంధ సంఘాల రాష్ట్ర చైర్మెన్, పీసీసీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత నియోజకవర్గంలో కార్యకర్తలను నేరుగా కలిసేందుకు తగిన ప్రణాళికను రూపొందించారు. అందులో భాగంగానే నేడు నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నారు. దీనికి పీసీసీ అధినేత రేవంత్‌రెడ్డి, ఎంపీపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తదితర నేతలంతా పాల్గొంటున్నారు. అంతేగాకుండా 16న మర్రిగూడ, నాంపల్లి, 18 చండూరు , మునుగోడు , 19న నారాయణపూర్, చౌటుప్పల్ మండల స్థాయిలో సుమారు 2వేల మంది కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. 20న మాజీ ప్రధాని రాజీవ్‌గాందీ రాజీవ్‌గాందీ జయంతి సందర్బంగా నియోజకవర్గంలోని సుమారు 175 గ్రామాలలో పార్టీ జెండావిష్కరణతోపాటుగా ఇంటింటికి పాదయాత్ర చేపట్టనున్నారు. 20 నుంచి 30వరకు ప్రతి గ్రామంలోనూ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ మొత్తం కార్యక్రమాలకు పార్టీ రాష్ట్రస్థాయి అగ్రనేతలంతా హాజరు కానున్నారు.
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈనెల 21న బీజేపీ పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే రోజు మునుగోడు మండల కేంద్రంలో పెద్దఎత్తున సభ నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్యఅతిధిగా కేంద్రహోంమంత్రి అమిత్‌షా పాల్గొనే ఈ సభలో కోమటిరెడ్డి జెండా కప్పుకోనున్నారు. అదే రోజు నుంచి నియోజకవర్గంలో తమ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నారు. పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తన అత్తగారి గ్రామమైన పలివెలలో ఉంటూనే అక్కడి నుంచి వ్యవహరాలు నడిపించేందుకు కార్యచరణను సిద్దం చేసినట్లు తెలుస్తుంది. అంతేగాకుండా ఎన్నికల ఇన్‌చార్జీగా వివేక్ వెంకటస్వామిని నియమించాలని కోమటిరెడ్డి పార్టీని కోరారని, అందుకు పార్టీ కూడ సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం.మిగతా నేతలంతా నియోజకవర్గంలోనే బసచేస్తూ పార్టీ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిసింది.
టీిఆర్‌ఎస్ పార్టీలో ఉన్న అసమ్మతి వాదులతో గత మూడు రోజుల క్రితమే జిల్లా మంత్రి జగదీశ్రెడ్డిచర్చలు జరిపారు. అభ్యర్థి ఎవరైనా పార్టీ కోసం విజయం కోసం పనిచేయాల్సిందేనని అందరిని ఒప్పించారు. అయితే బీజీపి సభ కంటే ముందే నియోజకవర్గంలో పెద్దఎత్తున 20న సభ ఏర్పాటు చేసేందుకు పార్టీ ఆధినాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలు, చేపడుతున్న పథకాలపై నియోజకవర్గ ప్రజలకు సభ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశ్యంతో సభ ఏర్పాటుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇప్పటీకే అధినేత ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలంతో సమావేశమై చర్చించినట్లు సమాచారం.ఈ ఉప ఎన్నికలకు ఇన్‌చార్జీగా ఆర్థికశాఖ మంత్రి హారీష్‌రావును నియమించనున్నట్లు సమాచారం. అయితే సభ ఏర్పాటు స్థలాన్ని కూడా శుక్రవారం మంత్రి జగదీశ్‌రెడ్డి, నియోజకవర్గ నేతలతో పరీశీలన కూడా చేశారు.
మొత్తంగా అన్ని రాజకీయ పార్టీ తమ ఉప ఎన్నికల ప్రచార హోరును మొదలు పెట్టడంతో ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారు. ఏదేమైనా ఎన్నికల వాతావరణ రోజు రోజుకు మరింతగా వెడేక్కుతుంది.