Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు రోజుల పాదయాత్ర 90 కిలోమీటర్లు
- 23 కోట్లా 52 లక్షలతో కాలువ పనులు
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
పిల్లాయిపల్లి కాలువ సాధించడంలో కమ్యూనిస్టుల పోరాటం ద్వారానే 2006 సంవత్సరంలో ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాదయాత్ర 90 కిలోమీటర్లు వందలాది మందితో పాదయాత్ర నిర్వహించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రాంత రైతాంగం బాధలను పాదయాత్ర ద్వారా తెలియజేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం 23 కోట్లా52 లక్షల రూపాయలను వెచ్చించి కాలువ పనులను ప్రారంభించింది. పోచంపల్లి చౌటుప్పల్ రామన్నపేట చిట్యాల మండలాల వరకు కాలువను పనులు చేపట్టారు పోచంపల్లి మండలం రామన్నపేట చౌటుప్పల్ మండలాల వరకు కొంత సాగునీరు అందిన ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందకపోవడంతో ఈ ప్రాంత భూములు బీడు భూములు గానే మిగిలిపోయాయి పిల్లాయిపల్లి కాలువల ద్వారా ఆయా గ్రామాలలోని చెరువులు నింపడం ద్వారా కొన్ని వేల ఎకరాలు ఈ ప్రాంతం సాగు లోకి రావడం 15 సంవత్సరాల నుండి పిల్లాయిపల్లి కాలువ పనులను పూర్తిస్థాయిలో నిర్వహించక పోవడంతో ఈ ప్రాంత రైతాంగానికి పూర్తిస్థాయిలో సాగునీరు అందక బీడు భూములు గానే మిగిలిపోయాయి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మ రెడ్డి పల్లె పిల్లాయిపల్లి పునాదిగానే కాల్వ వర్మ తుల కోసం సుమారు మూడు కోట్ల 30 లక్షల రూపాయలను కేటాయించింది. కేటాయించి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కాలువ పనులు పూర్తి కాలేదు. గత రెండు సంవత్సరాల నుండి క్రాఫ్ హాలిడే ప్రభుత్వం ఇస్తూ ఇప్పటికీ కూడా కాలువ పనులను పూర్తి చేయలేని పరిస్థితి మూడుసార్లు క్రాప్ హాలిడే ద్వారా సుమారు ఈ ప్రాంత రైతాంగం 20 కోట్లు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ కాలువ పనులు పూర్తిస్థాయిలో చేపట్టినట్లు అయితే కొన్ని వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. కాలువకు సైడ్ వాల్స్ పటిష్టంగా ఏర్పాటు చేసినట్లయితేపై మండలాలకు నీరు పోతాయి.
గోదావరి జలాలను పోచంపల్లి మళ్లించాలి
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి
గోదావరి జలాలను పోచంపల్లి మండలానికి శామీర్‌పేట చెరువు నుండి రాంపల్లి ఘట్కేసర్ ఎదులాబాద్ పిలాయిపల్లి కాలువలోకి మళ్లించాలి. పిల్లాయిపల్లి కాలువ ద్వారా వస్తున్న నీటిలో వ్యర్థ పదార్థాలు కలవడంతో నీరు కలుషితమై చౌటుప్పల్ పోచంపల్లి మండలం పారిశ్రామిక ప్రాంతం కావడంతో మూసీ లో వదలడం వల్ల వల్ల నీరు కలుషితం అవుతున్నాయి. పిల్లాయిపల్లి కాలువ నీటిని ప్రక్షాళన శుద్ధి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలి.పిల్లాయిపల్లి కాలువకు మరమ్మతులు పటిష్టంగా చేపట్టి సాగునీరు అందించేందుకు ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ చూపాలి ఉమ్మడి రాష్ట్రంలో స్వరాష్ట్రంలో పిల్లాయిపల్లి కాలువ మరమ్మతులు ప్రతిష్టగా చేపట్టకపోవడంతో మరమ్మతుల పేరుతో ఇప్పటికి మూడు సార్లు క్రాఫ్ హాలిడే ఇవ్వడంతో కొన్ని వేల కోట్లు రైతులు నష్టపోయారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసి కాలువ పనులను పూర్తి చేయాలి.