Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆత్మకూర్ఎం
మూసీకి ప్రత్యామ్నాయంగా గోదావరి కృష్ణ జలాల సాధన కోసం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరుయాత్ర గోడ, ప్రచార పోస్టర్లను శనివారం మండల కేంద్రంలో ఆ పార్టీ మండల నాయకులతో కలిసి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 26న మండలంలోని మూసీ ప్రభావిత ప్రాంతాల్లో పోరుయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. యాత్రకు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ మద్దతు తెలిపి. విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం ఆ పార్టీ డివిజన్ నాయకులు నోముల నర్సిరెడ్డి మండల నాయకులు రాచమల్ల సత్తయ్య చెరుకు మల్లేష్ తుమ్మల సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీబీనగర్ : మూసీ జలాల ప్రక్షాళన కోసం సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న పోరుయాత్ర వాల్ పోస్టర్ను శనివారం సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రవహిస్తున్న మూసీ నది జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి అని వేలాది ఫార్మా కంపెనీలోని వ్యర్ధాలు మూసిలో కలపడం వలన జలాలు పూర్తిగా కలుషితమయ్యాయన్నారు .దీంతో మూసీ పర్యాయక ప్రజలు అనేక రోగాల బారిన పడదు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజలకు గోదావరి నీళ్లు అందించాలని సీపీఐ(ఎం) చేస్తున్న పోరుయాత్ర ఈనెల 22 బీబీనగర్ మండలం లో పర్యటిస్తున్నందున ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి బండారి శ్రీరాములు, నాయకులు గాడి శ్రీనివాస్, మంగ కుమార్, రక్తం నరసింహ, బండి శ్యామ్, కుమ్మరి సురేష్ ,పోతరాజు, దానయ్య, నోముల బస్వారెడ్డి, రమేష్, స్వరూప, పాల్గొన్నారు.
భూదాన్ పోచంపల్లి: మూసీ జల కాలుష్యం నుండి విముక్తి కోసం, మూసీి ఆయకట్టు ప్రాంతంలో గోదావరి, కృష్ణా జలాల సాధన కోసం ఈ నెల 22 ,23 తేదీలలో మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) పోరుయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల కార్యదర్శి మహిళ లింగారెడ్డి కోరారు. శనివారం నవ తెలంగాణతో ఆయన మాట్లాడుతూ మూసీ ప్రాంతాన్ని విషపు నీరు కమ్మేసిందన్నారు. ఏళ్ల తరబడి గత్యంతరం లేక ప్రజలు ఈ నీటిని వాడుతూ పంటలు పండిస్తున్నారన్నారు. ఒకవైపు బువ్వ పెట్టే భూమి, విషం చిమ్ముతుంటే ,మరోవైపు ప్రజారోగ్యం పశు,మత్స సంపద జీవజాలం యొక్క మనగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. 40 ఏళ్ల క్రితం తాగునీటి అవసరాలు తీర్చిన మూసీి ఇప్పుడెందుకు మురికి కుంపంగా మారిందో పాలకులే సమాధానం చెప్పాలన్నారు. మండల వ్యాప్తంగా ప్రజలు మూసీి కాలుష్యం వల్ల అనేక రోగాల పాలు అవుతున్నారన్నారు. మండలానికి 22 రాత్రి 7 గంటల 20 నిమిషాలకు ఫిలాయిపల్లిలో బహిరంగ సభ , 23న జగత్ పల్లి పెద్దగూడెం, జూలూరు, కపురాయిపల్లి, పెద్ద రావులపల్లి ,గోస్కొండ ,రామలింగంపల్లి ,శివారెడ్డి గూడెం ,రేవనపల్లి ముక్తాపూర్ ,పోచంపల్లి ,కనుముక్కల వరకు వస్తున్న బస్సు పోరు యాత్ర ప్రజలు జయప్రదం చేయాలని కోరారు.
రామన్నపేట : మూసీ నీటికి ప్రత్యామ్నాయంగా కష్ణా, గోదావరి నీరు అందజేయాలని సీపీిఐ(ఎం) మండల కమిటీ సభ్యులు వేముల సైదులు కోరారు. శనివారం మండలంలోని కక్కిరేణి గ్రామంలో రైతులతో కలిసి సీపీఐ(ఎం) పోరు యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక పార్మ కంపెనీ నుండి కలుషిత వ్యర్ధాలు మూసీిలో కలవడం వల్ల ప్రజలకు అనేక అంటు వ్యాధులతోపాటు క్యాన్సర్ కు కారణమయ్యే ప్రమాదకరమైన కారకాలు మూసిలో ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గోదావరి, కష్ణాజలాలను ద్వారా మూసీ పరివాహ ప్రాంతాల రైతులకు ఉన్న సాగు,తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ శాఖ కార్యదర్శి కన్నబోయిన యాదయ్య, రైతులు సోమనబోయిన వెంకటాద్రి, దూకేందర్ , చిల్లా యాదగిరి, నడిగోటి శ్రీను, ఈదులకంటి శివ కుమార్, బోడ వెంకట్ నర్సయ్య, వేముల దుర్గయ్య, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.