Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుగ్గ నవీన్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు.
నవతెలంగాణ- ఆలేరు రూరల్.
ఆలేరు నియోజకవర్గ కేంద్రం నుండి అమ్మనబోలు, మోటకొండూర్ మండల కేంద్రాన్ని కలిపే రోడ్డును పట్టించుకోకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పక్షపాతం వహిస్తున్నారని డీివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుగ్గ నవీన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలేరు, మోటకొండూర్ మండలాల పరిధిలోని బహదూర్ పేట, మంతపురి, దిలావర్ పూర్, ఇక్కుర్తి, శర్భనాపురం, మాటూరు, అమ్మనబోలు గ్రామాలకు రోజుకు వేల మంది ప్రయాణికులు, రైతులు, పై చదువుల కోసం విద్యార్థులు, రోజువారి కూలీలు, ఉద్యోగులు ప్రయాణిస్తుంటారని తెలిపారు. ఈ రోడ్డు మొత్తం గుంతలమయంగా మారడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్నెళ్ల క్రితం రోడ్డును తవ్వి కంకర వదిలేయడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ రోడ్డు లొనే బహద్దూర్ పేట, మంతపురి మధ్యలో రెండు చోట్లా రోడ్డు కు ఇరువైపులా కల్వర్ట్ల దగ్గర గుంతలు పడి నెలలు గడుస్తున్నా పట్టించుకున్న నాధుడే లేడన్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గౌరవనీయులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రజాదర్బార్లో టీవైఎఫ్ఐ ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసినప్పటికి పరిష్కారం కాలేదన్నారు. మంతపురి - దిలావర్ పూర్ గ్రామాల మధ్యలో హై లెవల్ వంతెన అసంపూర్తిగా ఉండడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారనానరు. వెంటనే అధికారులు, ఎమ్మెల్యే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని కోరారు.