Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
భారతదేశానికి నాయకత్వం వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి రైతు నాయకుడు తక్షణ అవసరమని అందుకే రాష్ట్ర యువత కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని తీర్మానాలు చేస్తున్నారని డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు.శనివారం యాదగిరిగుట్ట గొంగిడి నిలయంలో తుర్కపల్లి మండలానికి చెందిన పలువురు నాయకులు టీిఆర్ఎస్లో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 29 రాష్ట్రాల రైతు నాయకులు భారతదేశానికి స్వయాన రైతు అయిన కెేసీఆర్ నాయకత్వం అవసరమని కోరారని తెలిపారు.అప్పట్లో రైతు నాయకులు చరణ్ సింగ్ దేవిలాల్ ఉన్నప్పుడు రైతుల పట్ల అమితమైన ప్రేమ చూపించి రైతు అనుకూల చట్టాలు తెచ్చారని,ఇప్పుడు రైతు నాయకుడు లేనందునే మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువస్తున్నారని విమర్శించారు.రైతు నాయకుడు లేని లోటు పూడ్చేందుకు కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం ఖాయమన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస,్ బీజేపీనుండి పుల్లేల లక్ష్మణ్ నాయకత్వంలో చేరిన రెండు వందల మంది ని ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ తుర్కపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు బోయిని సత్తయ్య మండల అధ్యక్షుడు పి నరేందర్ రెడ్డి,నాయకులు నరసింహులు ,రవీందర్ నాయక్ హరి నాయక్ ,మోత్కుపల్లి రఘు,సర్పంచులు ఎం సత్యనారాయణ ,కే ప్రభాకర్ రెడ్డి ,ఎంపీటీసీలు జి కరుణాకర్ ,యూత్ నాయకులు గట్టు నిఖిల్ ఆకుల బాలరాజు ,పి బాబు ,పి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.