Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరు టౌన్
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, ఆర్ పీఆర్పీ లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ,విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం పాఠశాల గేటు ఎదుట ధర్నా నిర్వహించారు .అన్నంలో పురుగులు వస్తున్నాయని , టాయిలెట్స్ పరిశుభ్రంగా లేవని, వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు .పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు టి నరేందర్ మాట్లాడుతూ కళాశాల ప్రిన్సిపల్ సునీత విద్యార్థుల పట్ల దురుసుగా మాట్లాడుతున్నారన్నారు. తల్లిదండ్రులు ఇదేంటని ప్రశ్నిస్తే కసురుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు .
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తున్నాం
పాఠశాల ప్రిన్సిపాల్ సునీత
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శీలం సునీతను విలేకర్లు సమస్యలపై ప్రశ్నించగా పెరిగిన నిత్యావసర ధరలకనుగుణంగా మెస్ ఛార్జీలు రావడం లేదు. అయినప్పటికీ నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో గైడెన్స్ ప్రకారం ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నాం. పై అధికారులు ఇస్తున్న, మెనూను అమలుచేస్తున్నామన్నారు.4.80 మంది విద్యార్ధులు ప్రస్తుతం ఉన్నారు. ఫస్ట్ గురుకుల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం.సెల్ ఫోన్లు వాడే విద్యార్ధుల పట్ల కఠినంగా ఉంటున్నాం. పేరెంట్స్ లో కొందరు నిబంధనలకు విరుద్ధంగా విధులకు ఆటంకం కల్పిస్తున్నారు. .స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమంలో భాగంగా పేరెంట్స్ కమిటీ త్వరలో వేస్తామం. సమస్యల గురించి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దృష్టికి తీసుకెళ్లాం..