Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ
నవతెలంగాణ -భువనగిరి
వీరనారి,విప్లవ మూర్తి ఐలమ్మ పోరాట స్ఫూర్తి తో మతోన్మాద బీజేపీ పై ఉద్యమించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 37వ వర్థంతిని శనివారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నైజాం, రజాకార్లకు, భూస్వాములకు వ్యతిరేకంగా వెట్టి చాకిరి విముక్తి కోసం ,దున్నేవాడికే భూమి కావాలని పోరాటం చేసిన వీరవనిత ఐలమ్మ అన్నారు. నాటి వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్ర లేనటువంటి బీజేపీి చరిత్రను వక్రీకరిస్తుందన్నారు. ఐలమ్మ వర్థ్ధంతితో వారోత్సవాలు ప్రారంభమై ఈనెల 17 వరకు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి, పట్టణ కమిటీ సభ్యులు సభ్యురాలు వడ్డెబోయిన స్వప్న, రమా కుమారి, సరిత ,పద్మాబాయి ,రాధిక , లలిత ,అనిత, సరోజినీ, శాంత ,మంజుల ,కమల ,భాగ్య,లక్ష్మి, సరిత ,మంగమ్మ, శ్యామల పాల్గొన్నారు.
ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి
రామన్నపేట : వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు.ఆపార్టీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సుభాష్ సెంటర్ లో ఐలమ్మ 37వ వర్థంతి సందర్బంగా అమె చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టికి వ్యతిరేకంగా దొర గఢలీను గడగడలాడించిన వీర వనిత ఐలమ్మ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి, నాయకులు గాదె నరేందర్, కందుల హనుమంతు, బావనులపల్లి సత్యం, బొడిగే లింగస్వామి, అంతటి సత్తయ్య, పెండెం బ్రహ్మయ్య, కూనూరు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...
కాంగ్రెస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగా సుభాష్ సెంటర్ లో అమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సాల్వేర్ అశోక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్, మండల మైనార్టీ సెల్అధ్యక్షులు మహబూబ్ అలీ, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు మండల యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ జానీ, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో...
మండలకేంద్రంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి సీపీఐ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి ఊట్కూరు నరసింహ , మండల సహయ కార్యదర్శి ఎర్ర రమేష్ గౌడ్, సిపిఐ సీనియర్ నాయకులు బాలగోని మల్లయ్య, భగవంత, గీత పని వారల సంఘం మండల అధ్యక్షులు గంగాపురం వెంకటయ్య, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు ఊట్కూరి కృష్ణ, కూనూరు లక్ష్మీనరసింహ, తదితరులు పాల్గొన్నారు.
పెత్తందారి వ్యవస్థను తరిమికొట్టిన వీరనారి ఐలమ్మ
తెలంగాణ ప్రాంతంలో వెట్టి చాకిరి నిర్మూలన కోసం పెత్తందారులను తరిమికొట్టిన వీరనారి చాకలి ఐలమ్మ అని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని కక్కిరిని గ్రామంలో చాకలి ఐలమ్మ 37వ వర్థ్ధంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్ లో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కక్కిరేణి గ్రామంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, టీఆర్ఎస్ట మండల అధ్యక్షులు మందడి ఉదరు రెడ్డి, గ్రామ సర్పంచ్ పిట్ట కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, నాయకులు పోషబోయిన మల్లేశం, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, నీల దయాకర్, రజక సేవా సమితి జిల్లా కన్వీనర్ బొడ్డుపల్లి లింగయ్య, ప్రజావాణి గ్రంథాలయ నిర్వాహకులు వేముల సైదులు, కందుల హనుమంతు, గోగు సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
రాజాపేట: మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద ప్రజల సంఘం రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్థంతిని శనివారం నిర్వహించారు. ఆమె చిత్రపటానికి టీిఆర్‌ఎస్ జనరల్ సెక్రెటరీ సట్టు తిరుమలేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిద్ధులు, వెంకట్ నర్సు, నర్సింలు, కనకయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
అడ్డగూడూరు : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ 37 వ వర్థంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోపీఏసీిఎస్ చైర్మెన్ పొన్నాల వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొమ్మగాని లక్ష్మయ్య ,బీజేపీ అధ్యక్షులు కడియం సోమన్న, అడ్డగుడూర్ గ్రామ రజక సంఘం ప్రధాని కార్యదర్శి పరిగెల కనకయ్య, కోట మర్తి గ్రామ రజక సంఘం అధ్యక్షులు మనిపెద్ది సురేందర్ ,మనిపెద్ది మత్స్యగిరి , రజక సంఘం గ్రామ సభ్యుడు పొన్నాల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామారం : మండల కేంద్రంలో బస్ స్టాండ్ చౌరస్తా వద్ద వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి సీపీిఐ మండల కార్యదర్శి అన్నేమైనా వెంకటేశం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : యండలంలోని కొలనుపాక గ్రామంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు ఎంపీపీ గంధ మల్ల అశోక్ ,టీిఆర్‌ఎస్ మండలఅధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ,రాఘవపురం ఎంపిటిసి ప్రశాంత్ , సహకార సంఘం అధ్యక్షులు మామిడాల కిష్టయ్య, మాజీ ఎంపీటీసీ మామిడాల అంజయ్య ,తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు జంగా స్వామి, వార్డు సభ్యులు పరశురాములు, బాలరాజు ,నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరిరూరల్ : చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘంఆధ్వర్యంలో బీసీ బాలుర కళాశాల హాస్టల్లో కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పొత్నక్ ప్రమోద్ కుమార్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డ్ కౌన్సిలర్ పంగారెక్కల స్వామి , సామాజిక కార్యకర్త మాటూరి బాలేశ్వర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రావుల రాజు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్, విద్యార్థులు నరేష్, సురేష్ , మహేష్ మధు లు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : తెలంగాణ సాయుధ పోరాట అసలైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎంఏ .ఇక్బాల్ ,డీసీసీబీ మాజీ డైరెక్టర్ మోరిగాడి చంద్రశేఖర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వర్థంతి పురస్కరించుకొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మోరీగాడి రమేష్ తాళ్లపల్లి గణేష్ ఘనగాని మల్లేష్ మోడీ గాడి అజరు వడ్డేమాన్ బాలరాజు భువనగిరి గణేష్ వడ్డిమాను విప్లవ్ అక్కల్దేవ్ భాస్కర్ ఘనగాని రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ధిక్కార స్వరానికి నిలువుదట్టం మహిళ లోకానికి స్పూర్తిధీర వనిత చాకలి ఐలమ్మ అని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య అన్నారు మండల కేంద్రంలో శనివారం చాకలి ఐలమ్మ విగ్రహనికి ఆయన పులామాల వేసి నివాళులర్పించారు .ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంధమల్ల అశోక్ , ఎంపీటీసీ ఆరె ప్రశాంత్ ,ఎజాజ్, విద్యాసాగర్ పాల్గొన్నారు .
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో
వీర తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 37వ వర్థంతి సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ , కౌన్సిలర్ బేతి రాములు,డాక్టర్ చింతకింది మురహరి ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఇన్చార్జి సర్పంచ్ దాసి సంతోష్, జిల్లా నాయకులు మాదాన్ని ఫిలిప్ , గిరిరాజ్ వెంకటయ్య మొరిగాడి వెంకటేష్ , జూకంటి ఉప్పలయ, పూల శ్రవణ్ అలేటి అనిల్ ,ఎండి షాబుద్దీన్, ఎండి ఫయాజ్, నారాయణ సిద్ధులు, బాకీ ఆనంద్, మహమూద్ , వినయ్ తదితరులు పాల్గొన్నారు .
చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీ సీపీఐ(ఎం) కమిటీ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి అయిలమ్మ 37వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణకేంద్రంలోని అయిలమ్మ విగ్రహానికి ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆ పార్టీ మున్సిపాలిటీ కార్యదర్శి బండారు నర్సింహా, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాట వీరనారి అయిలమ్మ పోరాట స్ఫూర్తితో నేటి తరం ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.పాషా, గుంటోజు శ్రీనివాస్‌చారి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, నాయకులు గోశిక కరుణాకర్, బత్తుల దాసు, ఎర్ర ఊషయ్య, తడక మోహన్, బొడ్డు అంజిరెడ్డి, తొర్పునూరి మల్లేశం, మట్టిపల్లి మల్లేశం, బోదాసు వెంకటేశం, బోయ యాదయ్య, గుణమోని కృష్ణ, అయిలయ్య పాల్గొన్నారు.
ఐద్వా ఆధ్వర్యంలో : చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని సీపీఐ(ఎం) పట్టణ కార్యాలయంలో ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో శనివారం వీరనారి చాకలి అయిలమ్మ 37వ వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అయిలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గోశిక సుమతి, బత్తుల జయమ్మ, సఫియాబేగం, దొడ్ల ఆండాలు, గోశిక అనిత, రేష్మ, అర్షియా, భావండ్లపల్లి సునంద పాల్గొన్నారు.