Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తుంగతుర్తి: భూమికోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం,పోరాడి తెలంగాణ ప్రజల తెగువను,పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీరవనిత చాకలి ఐలమ్మ అని మండలపరిధిలోని వెంపటి గ్రామ సర్పంచ్ అబ్బగాని పద్మ సత్యనారాయణగౌడ్,ఎంపీటీసీ గుండగాని వీరస్వామి అన్నారు.శనివారం ఆ గ్రామంలో రజకసంఘం, వివిధ పార్టీల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ భాషబోయిన వెంకన్న, సీపీఐ(ఎం) నాయకులు ఎనగందుల విష్ణుమూర్తి, గుండగాని అంజయ్య, రజక సంఘం అధ్యక్షులు ఐతరాజు అంజయ్య, బోనగిరి లక్ష్మీనారాయణ,తునికి సాయిలు,పులుగుజ్జు యాకయ్య, మడిపెద్ది యాదయ్య, ముత్తయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి : పట్టణంలోని మహాత్మాజ్యోతిబాఫూలే విగ్రహం ఎదుట తెలంగాణ సామాజిక మహాసభ ,బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య, బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తన్నీరు రాంప్రభు, నాయకులు ఫత్తేపురం యాదగిరి,పోరేళ్ల లక్మయ్య, రాజ్‌కుమార్, రెహమాన్,గిలకత్తుల రమేశ్‌గౌడ్, కందుకూరి ప్రవీణ్, నిరుమల యాకయ్య, నలుగురి రమేశ్, నాగరాజు, పనుమేంటి నాగేష్, బండి మధుగౌడ్,మడిపెల్లిఅశోక్గౌడ్, యాదగిరి, సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.
నూతనకల్: మండలంలోని చిల్పకుంట్లలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందాల శంకర్‌రెడ్డి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఆపార్టీ మండలనాయకులు సామ వెంకట్‌రెడ్డి, కట్ట సత్యనారాయణరెడ్డి, కూసు సైదులు, ఉప్పల్‌రెడ్డి, తొట్ల శ్రీను, జనార్దన్‌రెడ్డి, ఉప్పునూతల రమేశ్, మారయ్య, కూసు వెంకన్న, లింగయ్య పాల్గొన్నారు.
సూర్యాపేట: పట్టణంలోని న్యూఎస్సీసీ కాలనీలో చాకలిసంఘం జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్థంతి నిర్వహించారు.ఆమె చిత్రపటానికి టీఆర్ఎస్ జిల్లా నాయకులు శెనగాని రాంబాబుగౌడ్ పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సాజిద్, నాగరాజు, చారి, జలగం సత్యం, వెంకట్‌రెడ్డి, చిన్ని, కరాటే, ఐతగోని మల్లయ్య, చిట్టినాయుడు పాల్గొన్నారు.
హుజూర్నగర్ : పట్టణంలో ఐలమ్మ చిత్రపటానికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మెన్ జక్కులనాగేశ్వరరావు, టీఆర్ఎస్ అధ్యక్షుడు చిట్యాల అమర్నాథ్రెడ్డి, నాయకులు దాసరాజు నారాయణ, శంకర్,దుగ్గి గురువర్మ, ఉషశ్రీ, రామకృష్ణ పాల్గొన్నారు.అదేవిధంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ వర్థంతి నిర్వహించారు.ఈ కర్యాక్రమంలో బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ధూళిపాల శ్రీనివాస్ చిలకరాజు అజరుకుమార్,అధ్యక్షులు బొడ్డు గోవిందరావు, ప్రధాన కార్యదర్శి సీహెచ్.నర్సింహారావు, మహిళా సంఘం అధ్యక్షులు దీప, రామరాజు, వట్టెపు శ్రీనివాస్, వెంకటరమణ, శ్రీనివాస్, కృష్ణ, ముక్కంటి తదితరులు పాల్గొన్నారు.
మునగాల: మండలకేంద్రంలో సర్పంచ్ చింతకాయల ఉపేందర్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో రజకసంఘం జిల్లా నాయకులు సీతారాం, సీపీఐ పట్టణ కార్యదర్శి కాసర్ల రాజేష్, సీపీఐ(ఎం) పట్టణకార్యదర్శి గడ్డం వినోద్, రజకసంఘం నాయకులు గరిడేపల్లి నాగేశ్వరరావు, సిద్ధుల శ్రీను, తంగెళ్ల గోపాల్, తంగేళ్ల బుచ్చిబాబు, సట్టుగోపి, వడ్రానపు వీరబాబు పాల్గొన్నారు.
అర్వపల్లి : మండలకేంద్రంలోని జాజిరెడ్డిగూడెంలో రజకసంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ వర్థంతి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు తాడూరి గిరిబాబు, నాయకులు తాడురి అంజనేయులు,తాడూరి యాదగిరి, తాడూరి భద్రయ్య , రవి, సుతారప్ కిష్టయ్య, సుతారపు పిచ్చయ్య, బొబ్బిలి లింగమల్లు,గ్రామస్తులు యోగానందం, కోటమర్తి మల్లయ్య, జలంధర్, కుంభం సత్తయ్య, ఉప్పలయ్య, గాంధీ, సైదులు, సమ్మయ్య పాల్గొన్నారు.
చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను మండల పరిధిలోని కొమ్మాల గ్రామంలో ఆమె విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాధరి వెంకటమ్మ, కుంట్ల రేణుక, ఉపసర్పంచ్ దాసరిభిక్షం, ఉదరు, రంజిత్‌కుమార్, సందీప్, రజకసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్, లక్ష్మయ్య, విజరు, సతీష్ పాల్గొన్నారు.
సూర్యాపేటటౌన్ : జిల్లాకేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంతసత్యనారాయణపిల్లై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నాయకులు నీలకంఠచలమంద, చామకూరి నర్సయ్య, బత్తుల రమేశ్, బుద్దా సత్యనారాయణ, వరికుప్పల వెంకన్న, షేక్నజీర్, అన్నెపర్తి పద్మ, నిర్మల, సారగంట్ల వెంకటమ్మ, అనసూర్య, దుర్గమ్మ పాల్గొన్నారు.అదేవిధంగా జిల్లాకేంద్రంలోని విక్రమ్భవనంలో ఐలమ్మ చిత్రపటానికి సీపీఐఎంఎల్ ప్రజాపంథా జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివశంకర్ పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పీఓడబ్య్లూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు ఎర్ర అఖిల్, ఇప్టూ జిల్లా కన్వీనర్ రామోజీ, జహంగీర్, జీవన్, రాజేష్ పాల్గొన్నారు.
పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్‌అలీ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోతిగోపాల్రెడ్డి, అక్కినపల్లి జానయ్య, నరేందర్‌నాయుడు, ఆలేటి మాణిక్యం, నాంపల్లి శ్రీను, నాగునాయక్, గడ్డం వెంకన్న, నాగుల వాసు, అశోక్ పాల్గొన్నారు.