Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
కులంపేరుతో దూషించిన బండ పుల్లారెడ్డిని అరెస్టు చేయాలని దళితసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.శనివారం మండలకేంద్రంలోని అరిబండిభవన్‌లో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన దళిత ప్రజాసంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు దూళిపాల ధనుంజయ నాయు డు మాట్లాడారు.గరిడేపల్లి మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన విషయంలో కుట్రపన్ని,ఆ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేయడాన్ని ప్రతిఘటించిన దళిత నాయకులు పిట్టబాబును కులం పేరుతో దూషించి గొంతు నులిమి దౌర్జన్యం చేసిన పుల్లారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బచ్చలకూరి సుందర్రావు, జెమిని వడ్లమూడి, ఉపేందర్‌రావు, ఎడవెల్లి చంద్రయ్య ,పున్నయ్య, కోదాటి సైదులు, ఉబ్బపల్లిసైదులు,చిలకరాజు, శ్రీను, కడపదేవాదీనం, సిద్ధపంగు రామకృష్ణ, కాంతయ్య, కొత్తపల్లిరవి, వడ్లకొండ వెంకటేశ్వర్లు, కొమ్మరాజు వెంకట్, జెర్రిపోతుల వెంకటయ్య పాల్గొన్నారు.