Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రతి ఒక్కరూ దేశసమగ్రత, ఐక్యత కోసం కృషి చేయాలని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్ అన్నారు.శనివారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఆదేశానుసారం, ఈనెల 16,17,18వ తేదీలలో మూడ్రోజుల పాటు నిర్వహించే జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమీక్షాసమావేశం నిర్వహించి మాట్లాడారు.మండలకేంద్రంలో నిర్వహించే జాతీయ సమైక్యత దినోత్సవర్యాలీని నియోజక వర్గంలోని మండలాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమాల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు,సలహాలు చేశారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్,డీఎస్పీ నాగభూషణం, తుంగతుర్తి సీఐ నాగార్జునగౌడ్, నాగారం సీఐ రాజేష్‌నాయక్, ఎస్ఐలు డానియల్‌కుమార్, శివప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ పుష్ప, ఉమ్మడినల్లగొండజిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు,టీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్,తాటికొండ సీతయ్య, కటకం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.