Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గాదరికిశోర్‌కుమార్
నవతెలంగాణ-నూతనకల్
గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వలక్ష్యమని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు.శనివారం మండలపరిధిలోని లింగంపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం, సీసీరోడ్ల ప్రారంభం, మిర్యాలలో సీసీరోడ్ల ప్రారంభం, ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ, ఎర్రపహడ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, ఆసరా పింఛన్ల కార్డులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు.పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో చక్రవర్తి సకలజనుల సంక్షేమంకోసం ప్రభుత్వం అనేక కొత్తపథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. ఆసరా పెన్షన్,కల్యాణలక్ష్మీ, రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్‌భగీరథ,డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం, ఇంటి స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయల పంపిణీ,దళితబంధు వంటి అనేక సంక్షేమపథకాలను అమలు చేస్తుందన్నారు.గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణం పూర్తైందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డికళావతిసంజీవరెడ్డి, జెడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి,పీఏసీఎస్ చైర్మెన్ కనకటి వెంకన్న, వైస్‌ఎంపీపీ జక్కి పరమేశ్, సర్పంచులఫోరం మండలఅధ్యక్షుడు చూడి లింగారెడ్డి,సర్పంచులు కనకటి సునీతవెంకన్న, గుర్రం సత్యనారాయణ, గోరుగంటి ఉషారామ్ కిషన్‌రావు,ఎంపీటీసీలు మున్నలక్ష్మీమల్లయ్య, గార్దుల రజిత లింగరాజు, ఎంపీడీఓ ఇందిర, తహసీల్దార్ జమీరోద్దీన్, ఉపసర్పంచులు మున్న లింగయ్య, మన్నెం రమేష్, టీఆర్ఎస్ మండలఅధ్యక్షులు మున్న మల్లయ్య యాదవ్, ప్రధానకార్యదర్శి బత్తుల సాయిలుగౌడ్, పన్నాల మల్లారెడ్డి, కొంపల్లి రాంరెడ్డి, కొచ్చర్లబాబు, పన్నాల సైదిరెడ్డి, ఆసరా పింఛన్‌దారులు పాల్గొన్నారు.