Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాం నిరంకుశ క్రూరత్వపు పాలనలో దోపిడీకి వ్యతిరేకంగా ఐలమ్మ చూపిన చొరవ,ధైర్య సాహసలను పుణికి పుచ్చుకుని బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.శనివారం స్థానిక ఎంవీఎన్.భవనంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశం అనంతరం ఐలమ్మ వర్థంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించి మాట్లాడారు.ఎర్రజెండా నీడలో ఆమె సాగించిన తెలంగాణ సాయుధ రైతాంగ వీరోచితపోరాటం చరిత్రలో పోరాటాలకు స్ఫూర్తిదాతగా నిలుచిందన్నారు.బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాదంతో మంటలు రేపుతూ మనువాద భావజాలంతో సంప్రదాయ, సంస్కృతిని ధ్వంసం చేస్తూ కుల,మతాలతో ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతుందన్నారు.మతాలపేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు, అల్లర్లు రేపుతూ రాజకీయ లబ్దిపొందాలని ప్రయత్ని స్తుందన్నారు.సాయుధ పోరాటానికి నేతృత్వం వహించింది కమ్యూనిస్టు లేనన్నారు.సెప్టెంబర్ 17కు ఉన్న పోరాటచరిత్రను వక్రీకరించే విధంగా విమోచనదినం పేరుతో విచ్చిన్నకర ఎత్తుగడలను వేస్తుందన్నారు.భూస్వామ్య దోపిడీకి, జమీందారీ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో ఐలమ్మ అందరికి ఆదర్శంగా నిలిచిందన్నారు.సాయుధ పోరాటాన్ని మతఘర్షణగా చిత్రీకరించి హిందూ, ముస్లిముల మధ్య గొడవలుగా సృష్టించి జాతీయసమైక్యత హాని కలిగిస్తుందన్నారు.భూస్వాములు, నిజాంరజాకార్ల దోపిడీ,పీడనకు వ్యతిరేకంగా పోరాటంలో ఐలమ్మ చూపిన చొరవ,పోరాటస్పూర్తితో బీజేపీ,మతోన్మాద విధానాలకు పోరాటాలు ఉధృతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు,ధీరావత్ రవినాయక్,బుర్రి శ్రీరాములు, ఎల్గూరి గోవింద్, కోటగోపి,నాగారపుపాండు, మేకనబోయిన సైదమ్మ, శేఖర్,పారేపల్లి శేఖర్‌రావు, వేల్పులవెంకన్న,బూర శ్రీనివాస్,దేవరంవెంకటరెడ్డి,మేదరమెట్ల వెంకటేశ్వర్రావు, కందాల శంకర్‌రెడ్డి, మిట్టగడుపులముత్యాలు,జె.నర్సింహారావు,వేల్పుల వెంకన్న, చినపంగినర్సయ్య, కోదమంగుండ్ల నగేష్, వీరబోయినరవి,చెరుకుయాకలక్ష్మి, ఎల్గూరి జ్యోతి, షేక్యాకోబు,బెల్లంకొండ సత్యనారాయణ, దుగ్గిబ్రహ్మం పాల్గొన్నారు.