Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్(ఎస్)
తెలంగాణకు నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దండా వెంకట్‌రెడ్డి అన్నారు.శనివారం మండలకేంద్రంలో యాతాకుల మల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం, వెట్టిచాకిరి విముక్తి కోసం భూస్వాములకు, దొరలకు, పెత్తందారులకు, రజాకార్లకు, వ్యతిరేకంగా పోరాటం నడిపిన చరిత్ర కమ్యూనిస్టులదేనన్నారు.తెలంగాణలో చరిత్రను వక్రీకరించడానికి బీజేపీ ముందుకువస్తుందని విమర్శించారు.తెలంగాణ పోరాటానికి సంబంధం లేని వ్యక్తులు, పార్టీలు మావే అని చరిత్రహీనులు మాట్లాడుతున్నా రన్నారు.చరిత్రను మార్చలేమన్నారు.తెలంగాణ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా 17న సీపీఐ(ఎం) అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి జిల్లాకేంద్రానికి వస్తున్న సందర్భంగా జరిగే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండలకార్యదర్శి అవిరే అప్పయ్య, బోయిళ్ళ సాంబయ్య, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సానబోయిన ఉపేందర్, సోమిరెడ్డి దామోదర్‌రెడ్డి, నూకల గిరిప్రసాద్‌రెడ్డి,గంపలఎల్లయ్య, బెల్లంకొండ ఇస్తారి పాల్గొన్నారు.