Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
భువనగిరి పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వైరల్ ఫివర్ రాకుండా పేరెంట్స్ కమెటీ చైర్మన్ శేక్ హమీద్ పాష ఆధ్వర్యంలో శనివారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ శ్రీకాంత్ గండ్ర మాట్లాడుతూ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎటువంటి వ్యాధులు ప్రభలకుండా హెల్త్ క్యాంప్ ను నిర్వహించి మందులు అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొండా మురళి మోహన్ హెల్త్ ఎక్స్ టెన్షన్ అఫిసర్ బషీరోద్దీన్,నర్స్ రమాదేవి హరిబాబు,నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇస్తియాక్ మంజుల,విజయలక్ష్మి, ప్రసన్న లు పాల్గొన్నారు.