Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలోని 8వ వార్డులోని టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన వంద మంది టీఆర్ఎస్లో చేరారు. చేరిన వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలని తెలిపారు. కేసీఆర్ బలపర్చిన మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కారు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ ఎర్ర భుజంగం, లింగస్వామి, గోపనబోయిన శివ, ఎర్ర గాలయ్య, గ్యార మారయ్య, లందగిరి నర్సింహా, కడుపు రాములు, కానుగు యాదయ్య, కాటేపల్లి శంకరయ్య, చాట్ల బాలయ్య, ఊదరి మహేశ్‌తోపాటు మరో 50 మంది మహిళలు ఉన్నారు. ఆ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ బొడిగె అరుణబాలకృష్ణగౌడ్, నాయకులు పాశం సంజరుబాబు, గుండెబోయిన వెంకటేశ్‌యాదవ్, కానుగు బాలరాజు, సుర్కంటి నవీన్‌రెడ్డి, తొర్పునూరి నర్సింహాగౌడ్, చుక్క యాదయ్య, కట్కూరి కిరణ్‌గౌడ్, శంకర్ ఉన్నారు.