Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
నల్లగొండ నియోజక వర్గ కేంద్రంలో ఈ నెల 16 నుండి 18 వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సమైక్యతా వజ్రొత్సవాలు విజయ వంతం చేయాలని నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం అర్డిఓ కార్యాలయంలో నల్లగొండ నియోజక వర్గ ఎంపిడి ఓలు, తహశీల్దార్లు, మున్సిపల్, విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహణ పై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పక్షం రోజుల పాటు నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రొత్సవ వేడుకలు జిల్లాలో విజయవంతం చేసిన అందరికీ ధన్య వాదాలు తెలిపారు. స్వతంత్ర భారత వజ్రొత్సవ వేడుకలు విజయ వంతం చేసిన విధంగానే ఈ నెల 16,17,18 తేదీలలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న నల్గొండ నియోజకవర్గం, జిల్లా కేంద్రం లో నిర్వహించే జాతీయ సమైక్యత వజ్రోత్స వాలు అధికారులు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి విజయ వంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, ఆర్డీవో జగన్నాధరావు, డిఎస్పి నర్సింహరెడ్డి, డీఈవో బిక్షపతి, డిపిఆర్ ఓ శ్రీనివాస్, నల్లగొండ, కనగల్, తిప్పర్తి ఎంపీడీవోలు, తహశీల్దార్లు,రెవెన్యూ ,విద్యా శాఖ అధికారులు తదితరలున్నారు.