Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్ మద్దతు
నవతెలంగాణ-రాజాపేట
మండలంలోని రఘునాధపురం గ్రామాన్ని ప్రభుత్వం వెంటనే మండలంగా ప్రకటించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ డిమాండ్ చేశారు. రఘునాథపురంను మండలంగా ప్రకటించాలని కోరుతూ గ్రామస్తులు మండలకేంద్రంలో చేపట్టిన రిలేనిరాహార దీక్ష 32వ రోజు కొనసాగింది. శనివారం దీక్షా శిబిరాన్ని జహంగీర్ సందర్శించి మద్దతు తెలిపి మాట్లాడారు. రఘునాథపురం గ్రామం భౌగోళికంగా, సామాజికంగా ,ఆర్థిక రంగాలతో కూడి అన్ని రకాల అంశాలకు అర్హతలు కలిగి ఉందన్నారు. చిన్న మండలాలు పరిపాల వికేంద్రీకరణకు దోహదపడతాయన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఆనాడు చోళ రాజులు ,పాండ్య రాజులు తమ రాజ్యాన్ని మండలాలుగా, పరగణాలుగా విభజించారని గుర్తు చేశారు .రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు .లేనిచో పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చామకురా గోపాల్, డీవైఎఫ్ఐ నాయకులు గడ్డం వెంకటేష్, గూడూరి అంజిరెడ్డి ,పిల్లాయిపల్లి మాజీ సర్పంచి, బబ్బురి శ్రీను, బబ్బురి పోశెట్టి ,తెరాస మండల ప్రధాన కార్యదర్శి నకిర్త కనకరాజు , గుంటి శ్రీను, గొర్రె యాదగిరి, కలకుంట్ల కిష్టయ్య , నవీన్ ,వంశీ , సాయి బాబ, పద్మశాలి అధ్యక్షులు బింగి నర్సిహులు, బడుగు జాంగిర్, తదితరులు పాల్గొన్నారు.