Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి
అక్టోబర్ 9న భువనగిరిలో అంగన్వాడీ యూనియన్ 3వ జిల్లా మహాసభలు భువనగిరిలో నిర్వహిస్తున్నట్టు అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, అధ్యక్ష, కార్యదర్శులు బూరుగు స్వప్న, చిలువేరు రమాకుమారి తెలిపారు.ఆదివారం స్థానిక సీఐటీయూ కార్యాల యంలో జరిగిన అంగన్వాడీ యూనియన్ జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు.ఐసీడీఎస్ సంస్థను రక్షించుకుందామని, నూతన జాతీయ విద్యా విధా నాన్ని తిప్పికొడుదామన్నారు.ఐదేండ్లుగా పెండింగ్లో ఉన్న టీఏ,డీఏలను చెల్లించా లన్నారు.సింగిల్ పొయ్యితో ఇచ్చిన గ్యాస్ స్టౌలు ఎప్పుడో పాడైపోయినవని, వాటి స్థానంలో డబుల్ పొయ్యి స్టౌలు ఇవ్వాలని కోరారు.గ్యాస్ బుకింగ్ పుస్తకాలు సెంటర్ పేరున మార్చాలని డిమాండ్ చేశారు.సెంటర్స్కు పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు సెంటర్లో కనీససౌకర్యాలైన వాష్రూం, మంచినీళ్ళు, సెంటర్ నిర్వహణ కోసం డబ్బులు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. అదనపు పనులకు అదనపు వేతనాలు ఇవ్వాలన్నారు.పనిఒత్తిడిని తగ్గించాలన్నారు. ఇంకా అంగన్వాడీలు ఎదర్కొంటున్న సమస్యలపై జిల్లా మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు.ఈ సమావేశంలో యూనియన్ నాయకులు పద్మాబాయి, రాధిక, సరిత, అనిత, సరోజిని, కల్యాణి,సరిత, బాలలక్ష్మి, శాంత, కమలేశ్వరి, మంజుల పాల్గొన్నారు.