Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరురూరల్
గౌడ జన హక్కుల పోరాట సమితి మోగు దెబ్బ 1997 నుండి 25 ఏండ్లుగా రాజకీయపార్టీల కతీతంగా కల్లుగీత కార్మిక సమస్యలు పరిష్కరి ంచడంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కల్లుగీత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు గుల్లపల్లి వెంకటేష్ అన్నారు. ఆదివారం మండలంలోని శారాజిపేట గ్రామంలో వారు మాట్లాడుతూ గౌడ కులస్తులకు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కుల తమాషా ప్రకారం రావాల్సినటువంటి వాటాల సాధన కోసం ప్రజాఉద్యమంలో ప్రజాస్వామ్య అబద్ధమైన అటువంటి ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రభుత్వం నుండి రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేయడం జరుగు తుందన్నారు.రాబోయే రోజుల్లో గౌడల దామాషా ప్రకారం అన్ని కులాలు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ సామాజికవర్గం అయిన గౌడ శెట్టి ,బలిజ, ఈడిగ, కళాయి వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్ల పైన పిలువబడుతున్నటువంటి గౌడ కులస్తులందరినీ ఐక్యం చేసి రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా గౌడ సోదరులందరికీ ఒక వేదిక పైకి తీసుకువచ్చి వారికి ఎంత వాటా కావాలి రిజర్వేషన్ ప్రకారం సాధన కొరకు పోరాటం చేయడం జరుగుతుందన్నారు ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో గౌడ సోదరులందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి జైలుకు పోయి పీడీ యాక్టు ఉప సెక్షన్ల వంటివి భరించి పోరాటం చేస్తే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇతర కులాలకు 10,500 కోట్లు ఇస్తే మత్స్యశాఖ కారులకు 1300 వందల కోట్లు ఇస్తే ముదిరాజులకు 1400 కోట్లు ఇచ్చి బాబుని వాళ్లకు 100 కోట్లు రూపాయలు కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం గౌడ కులస్తులకు కూడా కేటాయించాలని కోరారు రాబోయే రోజుల్లో గౌడ కులస్తుల ఐక్య చేయడం కోసం నా వంతు కృషి చేస్తామని తెలియజేశారు.