Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలో చేర్చాలని, పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నందున వెంటనే నిత్యావసరాల ధరలను తగ్గించాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కంద్ర కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం మండలకేంద్రంలో మండల రోడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్, వర్కర్స్ మొదటి మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు గుండాల భిక్షం అద్యక్షతన నిర్వహి ంచారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ప్రతి వస్తువుపైనా జీఎస్టీ విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎందుకు జీఎస్టీ వేయడం లేదని ప్రశ్నించారు.పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే లీటర్ పెట్రోల్ రూ.60కే వస్తుందన్నారు. రవాణారంగం కార్మికులకే కాకుండా యావత్ దేశ ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతా యన్నారు.ట్రాన్స్‌పోర్టు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, నూతన మోటారు వాహన సవరణ చట్టం-2019ను రద్దు చేయాలని కోరారు. యాదగిరిగుట్టపైకి అటోలకు అనుమతించాలని, ప్రతి మండలకేంద్రంలో అటో అడ్డాలకు స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఏఐఆర్టీడబ్య్లూఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండి.పాషా, సీఐటీయూ మండల కన్వీనర్ మామిడి వెంకట్‌రెడ్డి, భవన నిర్మాణకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గొరిగె సోములు, రోడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్,వర్కర్స్ యూనియన్ నాయకులు తిరుపాల భిక్షపతి, బాలగోనిగణేష్, శంకర్, గొరిగేకృష్ణ, గోపాల్‌రెడ్డి,ఎండి.నజీర్, ఎర్రోళ్ల వంశీ, మిర్యాల మల్లేష్, తిరుపాల ఐలయ్య, ముషంనరహరి, వీరేశం, బండ లింగస్వామి పాల్గొన్నారు.