Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎంపొలిట్బ్యూరో సభ్యులు బృందాకరత్
నవతెలంగాణ-భువనగిరిరూరల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీచట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని, కేంద్రం కుట్రలను ఐక్యంగా తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ బృందాకరత్ ఉపాధిహామీ కార్మికులకు పిలుపు నిచ్చారు.ఆదివారం మండలంలోని అనాజిపురం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టంలో పనిచేసే కూలీలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.అనేక పోరాటాల ఫలితంగానే 2005లో సాధించుకున్న ఉపాధిహామీచట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక చట్టానికి ప్రతిబడ్జెట్లో నిధులు తగ్గిస్తూ చట్టాన్ని బలహీనపరుస్తూ చట్టాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందని విమర్శించారు.నేటికీ కూలీలకు పనికి తగ్గవేతనం అందడం లేదని పనిచేసే ప్రాంతాలలో కనీస సౌకర్యాలు కల్పించకుండా వారి శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొలతలతో సంబంధం లేకుండా కనీస కూలిరోజు రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు.గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే మహిళాకూలీలకు ఆరోగ్యపరంగా సరైన పోషకాహారం లేక జబ్బులకు గురవుతు న్నారన్నారు. పాలకులు ఆహారం వైద్య ఉపాధి విషయంలో పట్టించుకోవడంలేదని విమర్శించారు.ఒంటరి మహిళలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకనుకూలంగా ఉపాధి కూలీ రేటు రోజుకు రూ.600 ఇవ్వాలని, ఏడాదికి 200 దినాలు కల్పించాలని, పట్టణాలలోనూ ఈ చట్టాన్ని అమలు చేయాలని కోరారు.ఉపాధికూలీల పరిస్థితి గ్రామీణ పేద మహిళల పరిస్థితిపై వారి జీవన పరిస్థితి, ఆహారం, ఆరోగ్యంపై విషయాలను అడిగి తెలుసుకున్నామన్నారు.భూమిలేని ప్రజలు ముఖ్యంగా గ్రామీణ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారన్నారు.ఒక మహిళ రోజు ఆరు గుంతలు తీయడం, కొలతలతో కూడిన పని చేయడం కష్ట సాధ్యమని, వెంటనే కొలతలను ఉప సంహరించు కోవాలని డిమాండ్ చేశారు.
కూలీలను ఉపాధికి దూరం చేసేందుకు కేంద్రం కుట్ర
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి కూలీలకు ఉపాధికి దూరం చేసేందుకు కుట్ర పన్నుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ డిమాండ్ చేశారు. 2005లో ఉపాధిహామీచట్టాన్ని తీసుకురావడంలో వామపక్షాలు కీళ్లక పాత్ర పోషించాలని గుర్తు చేశారు.కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఈ చట్టానికి తక్కువ నిధులు కేటాయించి, కూలీలకు అనేక రకాల షరతులు విధిస్తూ ఉపాధికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.గతంలో మాదిగ ఉపాధి కూలీలకు సరైన వేతనాలు అందించాలని కొలతలతో సంబంధం లేకుండా కనీస వేతనం అమలు చేయాలని కోరారు.వందరోజుల పని దినాలను 200 దినాలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ కూలీలు పనిచేసే ప్రదేశంలో టెన్త్ సౌకర్యం మంచినీటి సౌకర్యం మెడికల్ కిట్టు తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు.ఉపాధి కూలీలకు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.ఎంపీటీసీలో ఫోరం జిల్లా కన్వీనర్ గునుగుంట్ల కల్పన శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కూలీలకు బీమాసౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.కూలీలకు ఉపాధిబీమా కల్పించాలని కోరారు.భువనగిరి మండలంలోని రెడ్డినాయక్ తండాలో బుజ్జమ్మ ఉపాధిహామీలో పనిచేసి మహిళా కార్మికురాలు చనిపోగా ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందలేదన్నారు.అనాజిపురం సర్పంచ్ ఏదునూరి ప్రేమలతమల్లేశం గ్రామీణ ప్రాంతంలో ఉపాధికూలీల సమస్యలు తెలుసుకోవడం సంతోషమని అన్నారు.మారుమూల గ్రామమైన అనాజిపురంలో గ్రామీణ పేద ప్రాంత ప్రజల కోసం కూలీలుగా పనిచేసే వారి కోసం ఒంటరి మహిళల కోసం అన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం గొప్ప విషయమన్నారు.గ్రామంలో మహిళా సమస్యలను అడిగి తెలుసుకున్నందుకు బందాకరత్కు ప్రత్యేకకతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జాతీయ నాయకురాలు టి.జ్యోతి, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మ, ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్,సీపీఐ(ఎం)మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల నాయకులు ఏదునూరి మల్లేశం, గునుగుంట్ల శ్రీనివాస్, బొల్లెపల్లి కుమార్, అబ్దుల్లాపురం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా నాయకులు జె జె.పెంటయ్య, పల్లెర్ల అంజయ్య, జూకంటి పౌల్, కొండపురం యాదగిరి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, నాయకులు ఏదునూరి వెంకటేష్ కొండ అశోక్,భిక్షపతి, బాలయ్య,జిట్ట అంజిరెడ్డి, ఎల్లంల వెంకటేష్ , నోముల జ్యోతి, బొల్లేపల్లి లీల, పద్మమ్మ, బుచ్చమ్మ, ఎల్లమ్మ, వెంకటేష్, బాలరాజు, భారతమ్మ, రాజు, అర్చన, వాణి, ఊర్మిళ, సునీత, ఉపాధికూలీలు పాల్గొన్నారు.