Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాములు
నవతెలంగాణ-సూర్యాపేట
యూఎస్పీసీ ఆధ్వర్యంలో ఈనెల 13న జరిగే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీిహెచ్.రాములు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా కోశాధికారి జి.వెంకటయ్య అధ్యక్షతన జరిగిన సూర్యాపేట డివిజన్ సమావేశంలో ఆయన మాట్లాడారు.దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు సాధించడం కోసం ఉపాధ్యాయులు పెద్దఎత్తున చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.17ఏండ్లుగా ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండడంతో పాఠశాలల్లో పర్యవేక్షణ కొరవడి నాణ్యమైన విద్య అందడం లేదన్నారు.ఉన్నత పాఠశాలలో వేలాదిగా సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్న కారణంగా విద్యార్థులు వివిధ విషయాలలో వెనుకబడుతున్నారని తెలిపారు.317 జీవో అమలు కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. పాఠశాలల్లో సర్వీస్ పర్సన్స్ లేకపోవడం వలన పరిశుభ్రత లోపించి విద్యార్థులు ,ఉపాధ్యాయులు అనారోగ్య పాలవుతు న్నారన్నారు. కావున వెంటనే సర్వీస్ పర్సన్స్‌ను నియమించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సోమయ్య, జిల్లా కార్యదర్శులు ఎస్కె.సయ్యద్, జె.యాకయ్య, సీహెచ్.వీరారెడ్డి, ఎం.వెంకన్న, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు పల్లె అనిల్‌కుమార్, జిల్లా అకాడమిక్ సెల్ కన్వీనర్ సీహెచ్.రమేశ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శ్రీనివాసచారి, వివిధ మండలాల బాధ్యులు శీనయ్య,బాలాజీ, రమేశ్, శేఖర్,బి.ఆనంద్ పాల్గొన్నారు.