Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షుడు ముప్పారపు నరేందర్
నవతెలంగాణ-సూర్యాపేట
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, మన నిత్య జీవితంలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా చేతి సంచులను మాత్రమే వాడాలని గ్రీన్‌క్లబ్ ట్రస్ట్ అధ్యక్షుడు ముప్పారపు నరేందర్, కార్యదర్శి డా.తోటకిరణ్ అన్నారు.ఆరవ గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక బాలాజీకన్వెన్షన్హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగిల్‌యూస్ ప్లాస్టిక్‌ను ప్రభుత్వం నిషేధించడం ఆహ్వానించాల్సిన విషయమన్నారు.దీనిని కట్టడి చేయడంలో ప్రభుత్వంతో పాటు గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సభ్యులు కూడా ముందుండాలని పేర్కొన్నారు.కొద్దిరోజులుగా ట్రస్ట్ సభ్యుల సహకారంతో ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ఇంటింటికి చేతి సంచి అందించాలనే పట్టుదలతో కొన్ని గ్రామాలతో పాటు పట్టణంలోని కొన్ని వార్డులలో జ్యూట్ బ్యాగులను అందిస్తున్నామని తెలిపారు.చిన్న పిల్లలకు పర్యావరణ పరిరక్షణపై బాధ్యత, మొక్కలపెంపకంపై అవగాహన, ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలను తెలియచెప్తూ కొన్ని స్కూళ్లలో పిల్లలకు అవగాహన కల్పించామని పేర్కొన్నారు. జనవరి నుండి ఇప్పటివరకు గ్రీన్ క్లబ్ ట్రస్ట్ చేసిన పనులను సభ్యులకు వివరించారు.సభ్యులు మాట్లాడుతూ భవిష్యత్‌లో పర్యావరణానికి మేలు చేకూర్చే పనులు ఇంకా చేపట్టి, ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో గండూరి కృపాకర్,ఉప్పల శ్రవణ్, ముప్పారపు నాగేశ్వరరావు,రాచర్ల కమలాకర్, కక్కిరేణి శ్రీనివాస్,డా.రామ్మూర్తియాదవ్,బొలిశెట్టి మధు, బందు శ్రీధర్‌బాబు, బహురోజుఉపేందర్,ఉప్పల శ్రీదేవి, అంజన్ ప్రసాద్, డా. భూమిరెడ్డి,మంచాల శ్రీధర్, కవిత,నూక రవిశంకర్, డా శిరీష దంగ్డే పాల్గొన్నారు.