Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు
నవతెలంగాణ-నూతనకల్
వ్యవసాయ భూమి లేని నిరుపేద వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం వ్యవసాయకార్మికబంధును ప్రకటించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఆదివారం మండలపరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో నిర్వహించిన ఆసంఘం మండలం 3 వ మహాసభలో వారు మాట్లాడారు.వ్యవసాయ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్రచట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు నేటికీ వ్యవసాయ రంగం మీద ఆధారపడిన గ్రామీణ పేదలుగా ఉన్న దళితులు, గిరిజనులు, వృత్తిదారులు, సన్న,చిన్న కారు రైతాంగం, చేతివృత్తుల వాళ్ళు జీవితాలు దుర్భరంగా మారాయన్నారు.కేంద్ర ,రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ సహకార వ్యవసాయం, యాంత్రీకరణ పంటల్లో వచ్చిన మార్పుల వల్ల వ్యవసాయ ఆధారిత పనులు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నో పోరాటాల ఫలితంగా పేదలు సాధించుకున్న చట్టాలను జీవోలను ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. జిల్లాలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు లేక పనులు దొరక్క వలసలు పోతున్నా రన్నారు.రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతు న్నాయన్నారు. అంతకుముందు మండలమహాసభల ప్రారంభ సూచికంగా సంఘం జెండాను సీనియర్ నాయకులు పంతం మల్సూరు ఆవిష్కరించారు.ఈ మహాసభలో పలు తీర్మానాలను ఆమోదించారు.ఆ సంఘం మండల నాయకులు గాజుల జానయ్య, బొజ్జ మారెమ్మ అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం,రైతుసంఘం జిల్లా సహాయకార్యదర్శి కందాల శంకర్‌రెడ్డి, కేవీపీఎస్ జిల్లా సహాయకార్యదర్శి దేవరకొండ యాదగిరి, మండల సోషల్‌మీడియా కన్వీనర్ అల్లిపురం సంజీవరెడ్డి, సీఐటీయూ మండలకన్వీనర్ బొజ్జ శ్రీను,ఎస్‌డబ్య్లూఎఫ్ జిల్లా కార్యదర్శి బత్తులసుధాకర్, మండలకార్యదర్శి పులసరి వెంకటముత్యం పాల్గొన్నారు.
నూతన మండల కమిటీ ఎన్నిక
మహాసభలో మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.వ్యవసాయ కార్మికసంఘం మండల అధ్యక్షులుగా వనం పుల్లయ్య, ఉపాధ్యక్షులుగా అల్లిపురం శ్రీనివాస్‌రెడ్డి, గాజుల జానయ్య, ప్రధానకార్యదర్శిగా పులసరి వెంకటముత్యం, సహాయకార్యదర్శిగా బొజ్జమారమ్మ,దూదిగాని ఎల్లయ్య, పొన్నంఅచ్చయ్యలను ఎన్నుకున్నారు.