Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డుపై కాలనీవాసులు బైఠాయింపు
నల్లగొండకలేక్టరేట్ :నల్లగొండ పట్టణంలోని 36వ వార్డు వివేకానందనగర్ కాలనీలోని ఇండ్ల మధ్యలో నిర్మించిన నాలాను ప్రభుత్వం వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పట్టణంలోని ఎల్ వీ పెట్రోల్ బంకు వద్ద కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ నాలాలపై అక్రమ కట్టడాలు నిర్మించడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు మురికినీరు ఇండ్లల్లోకి చేరుతుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని పలుమార్లు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలిపారు. ఈ నాలా నుండి ఎగువ ప్రాంతమైన లతీఫ్ సాహెబ్ గుట్ట, మీరుబాగ్ కాలనీల మురికినీరు పెద్ద వరద ప్రవహించడంతో కాలనీ వాసులంతా అనారోగ్యం పాలవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కేశబోయిన శంకర్ ముదిరాజ్, ఆదినారాయణ, రుద్ర ధనంజయ, జెల్లా హనుమంతు, గోపాల స్వామి, రాచమల్ల నారాయణ, తదితరులు పాల్గొన్నారు.