Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోటిఫికేషన్ను సవరించాలని ఎమ్మెల్యేకు వినతి
నవతెలంగాణ-నల్లగొండ
ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష నోటిఫికేషన్లలో కనీస అర్హత మార్కుల విషయంలో తెలంగాణ స్టేట్ లేవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ రిజర్వేషన్లను ఉల్లంఘించినదని, తక్షణమే 2022 ఏప్రిల్ నోటిఫికేషన్ను సవరించి రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జ్ బోడ సునీల్ మాదిగ, ఎమ్మెస్పీ నల్లగొండ నియోజకవర్గ ఇంచార్జి బకరం శ్రీనివాస్ మాదిగ, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షమయ్య, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఎమ్మార్పీఎస్, ఏమ్మేస్పీ అధినేత మందకష్ణ మాదిగ పిలుపు మేరకు ప్రజా సంఘాల నాయకులతో కలిసి రిజర్వేషన్ విధానాన్ని వర్తింపజేసే విధంగా చొరవ చూపాలని స్థానిక నల్లగొండ నియోజకవర్గ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డికి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఎస్సై, పోలీసు 2022 నోటిఫికేషన్ లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని కటాఫ్ మార్కుల విషయంలో ఓసిలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఒకే విధానం వర్తింపజేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ ఎరిగి శ్రీశైలం మాదిగ, పి.వై.ఎల్ రాష్ట్ర కార్యదర్శి ఇందూరి సాగర్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్, జనసమితి విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరనాయక్, కెవిపిఎస్ నాయకులు గాదె నరసింహ్మ, విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెరిక శ్రీనివాసులు, బొజ్జ దేవయ్య, కత్తుల సన్నీ, కురుపాటి కమలమ్మ, రమేష్, బోగరి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.