Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
నవతెలంగాణ-డిండి
గురుకుల విద్యాలయాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం డిండి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో స్వచ్ఛ గురుకుల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు పరిశుభ్రత పాటించాలని, పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటారన్నారు. గురుకుల అభివృద్ధి కి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గురుపూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5 నుంచి 11 వరకు స్వచ్ఛ గురుకులం కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ సిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య, ఎంపీపీ మాధవరం సునీతజనార్దన్రావు, రైతు బంధు అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర్రావు, మార్కెట్ వైస్ చైర్మన్ పేర్వాల జంగా రెడ్డి, పిఎసిఎస్ చైర్మెన్ తూం నాగార్జున్ రెడ్డి, స్థానిక సర్పంచ్ మేకల సాయమ్మకాశన్న, తదితరులు పాల్గొన్నారు.