Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
గౌడ కులాన్ని కించపరిచే విధంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఉద్దేశించి అసభ్యకరమైన పదాలతో మాట్లాడిన తీన్మార్ మల్లన్నను కఠినంగా శిక్షించాలని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేష్‌గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గో బ్యాక్ తీన్మార్ మల్లన్న అంటూ ప్లే కార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న జర్నలిస్టు ముసుగులో బడుగు బలహీన వర్గాల ప్రజలను అడ్డుపెట్టుకొని రాజకీయ నాయకులు ఇచ్చే ముడుపులకు ఆశపడి గౌడ కులాన్ని కించపరిచే విధంగా మంత్రిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సురిగి యాదయ్య గౌడ్, తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, గౌడ సంక్షేమ సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డు నాగరాజ్ గౌడ్, జిల్లా నాయకులు జాజుల పరమేష్ గౌడ్, తదితరులు పాల్గ్నొఆ్నరు.