Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని డీపీఓ యాదయ్య అన్నారు.సోమవారం మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలను అకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు.ఈ మేరకు కళాశాల ప్రాంగణాన్ని, తరగతగదులను, వంటగది పరిసరాలను, స్టాక్‌రూమ్‌ను పరిశీలించారు.మెనూ పాటిస్తూ, నాణ్యమైన విద్యతో పాటు మంచిఆహారం అందించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు.పేద బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల అభ్యున్నతి కోసం గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు.విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రిన్సిపాల్ చేస్తున్న కషిని అభినందించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు భీమారెడ్డి, పోలేపాక చైతన్య, ప్రిన్సిపాల్ శ్యామలత,వైస్ ప్రిన్సిపాల్ షేక్ ,హసీనా, అధ్యాపకబృందం వెంకటేశ్వర్లునాయక్, రమేశ్ పాల్గొన్నారు.